Nothing Phone (2a) లాంఛ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ కన్ఫర్మ్.!

Updated on 21-Feb-2024
HIGHLIGHTS

Nothing Phone (2a) లాంఛ్ చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్

కీలకమైన ఫీచర్స్ ను కూడా కన్ఫర్మ్ చేసింది

నథింగ్ స్మార్ట్ ఫోన్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా కొనసాగుతుంది

Nothing Phone (2a): నథింగ్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. నిన్నటి వరకూ ఈ ఫోన్ ను త్వరలో లాంఛ్ చేయనున్నట్లు తెలిపిన తెలిపిన కంపెనీ, ఇప్పుడు ఈ ఫోన్ లాంఛ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ ను కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను భారతీయ మార్కెట్ లో లాంఛ్ చేసే ముందుగా కంపెనీ ఈ ఫోన్ యొక్క ఒక్కొక్క కీలకమైన ఫీచర్ మరియు స్పెక్స్ తో టీజింగ్ చెయ్యడానికి సిద్దమయ్యింది. ఈ ఫోన్ గురించి కంపెనీ చేస్తున్న టీజింగ్ మరియు టీజింగ్ స్పెక్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Nothing Phone (2a) Launch

నథింగ్ ఫోన్ (2ఎ) స్మార్ట్ ఫోన్ ను March 5 తారీఖున సాయంత్రం 5 గంటలకి ఇండియన్ మార్కెట్ లో లాంఛ్ చేయడానికి డేట్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ నథింగ్ స్మార్ట్ ఫోన్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా కొనసాగుతుంది. అందుకే, ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది. అంతేకాదు, ఈ మైక్రో సైట్ పేజ్ నుండి నథింగ్ ఫోన్ (2ఎ) స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ తో టీజింగ్ ను కూడా చేస్తోంది.

Also Read: Smart Tv: 7 వేల బడ్జెట్ లో కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా.!

Nothing Phone (2a) Teased Specs

Nothing Phone (2a) Specs

నథింగ్ ఫోన్ (2ఎ) స్మార్ట్ ఫోన్ లో అందించిన ప్రోసెసర్ మరియు RAM వివరాలతో కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను MediaTek Dimensity 7200 Pro ఆక్టా కొర్ ప్రోసెసర్ తో తీసుకు వస్తున్నట్లు కంపెనీ అన్నొఉంచే చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 12GB RAM ఉన్నట్లు మరియు ఈ ఫోన్ ను మరింత వేగంగా చేయడానికి వీలుగా 8GB RAM Booster సపోర్ట్ తో టోటల్ గా 20 GB RAM సప్పర్ట్ తో వస్తుందని కంపెనీ చెబుతోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :