50MP + 50MP మరియు 32MP కెమేరాలతో వచ్చిన Nothing Phone (2a) 5G వచ్చింది
నథింగ్ బ్రాండ్ నుండి Nothing Phone (2a) 5G స్మార్ట్ ఫోన్ లాంఛ్ అయ్యింది.
50MP + 50MP మరియు 32MP వంటి భారీ కెమేరా సెటప్ తో వచ్చింది
ఈ ఫోన్ ను కేవలం మిడ్ రేంజ్ ధరలో లాంఛ్ చేసింది
నథింగ్ బ్రాండ్ Nothing Phone (2a) 5G స్మార్ట్ ఫోన్ తో ఇండియన్ మార్కెట్ నాడిని పట్టుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే, ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను 50MP + 50MP మరియు 32MP వంటి భారీ కెమేరా సెటప్ తో పాటుగా అందమైన LED లైట్స్ తో గొప్ప లుక్స్ అందించే ఈ ఫోన్ ను కేవలం మిడ్ రేంజ్ ధరలో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ లో అందించిన ఫీచర్స్ ఒకెత్తయితే, ఈ ఫోన్ ధర మరో ఎత్తవుతుంది.
Nothing Phone (2a) 5G: Price
నథింగ్ ఫోన్ (2a) 5G స్మార్ట్ ఫోన్ ను రూ. 23,999 స్టార్టింగ్ ప్రైస్ తో లాంఛ్ చేసింది కంపెనీ. ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ ఈ రేటుతో వచ్చింది. ఈ ఫోన్ యొక్క 8GB + 256GB వేరియంట్ రూ. 25,999 ధరతో మరియు 8GB + 256GB వేరియంట్ రూ. 27,999 ధరతో వచ్చాయి.
Nothing Phone (2a) 5G: Offers
నథింగ్ ఫోన్ (2a) 5G స్మార్ట్ ఫోన్ లాంఛ్ తో పాటుగా లాంఛ్ ఆఫర్లను కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ నథింగ్ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ మరియు EMI ఆప్షన్ తో కొనే యూజర్లకు రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ఎక్స్ చేంజ్ పైన రూ. 2,000 అధనపు తగ్గింపు కూడా ఆఫర్ చేస్తోంది.
Also Read: సూపర్ డీల్: బిగ్ డిస్కౌంట్ తో 8 వేల ధరకే వెబ్ బ్రౌజర్ Smart Tv అందుకోండి.!
Nothing Phone (2a) 5G: Specs
నథింగ్ ఫోన్ (2a) 5G స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ Flexible AMOLED డిస్ప్లేని Full HD+ రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ ఫోన్ డిస్ప్లే Gorilla Glass 5 రక్షణతో, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 30Hz – 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఫోన్ (2a) 5G మీడియాటెక్ Dimensity 7200 Pro ఆక్టా కోర్ ప్రోసెసర్ జత 8GB / 12GB ఆప్షన్స్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 128GB / 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లను కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో అందించిన కెమేరా మంచి ప్రత్యేకతలను కలిగి వుంది. కంపెనీ పేపర్ మీద అందించిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ లో వెనుక 50MP (Samsung GN9, OIS & EIS, AF) మెయిన్ కెమేరా + 50MP అల్ట్రా వైడ్ (Samsung JN1) కెమేరా కల్గిన డ్యూయల్ రియర్ కెమేరా వుంది ఈ ఫోన్ మెయిన్ కెమేరాతో 60 fps మరియు 30fps వద్ద 4K వీడియోలను, 60 fps మరియు 30fps వద్ద అల్ట్రా వైడ్ 4K వీడియోలను షూట్ చేయవచ్చని నథింగ్ తెలిపింది.