CMF Phone (1): సబ్ బ్రాండ్ నుండి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తెచ్చే ఆలోచనలో ఉన్న Nothing

Updated on 10-May-2024
HIGHLIGHTS

Nothing సబ్ బ్రాండ్ CMF నుండి స్మార్ట్ ఫోన్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు

15 వేల రూపాయల సబ్ కేటగిరి లో ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసే అవకాశం

CMF Phone (1) పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Nothing తన సబ్ బ్రాండ్ CMF నుండి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. CMF Phone (1) పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ 15 వేల రూపాయల సబ్ కేటగిరి లో ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసే అవకాశం ఉంటుందని కూడా ఈ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న రూ. 15,000 ప్రైస్ సెగ్మెంట్ లో కూడా అడుగుపెట్టడానికి నథింగ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

CMF Phone (1)

నథింగ్ ముందుగా ప్రీమియం సెగ్మెంట్ లో మాత్రమే స్మార్ట్ ఫోన్ లను తీసుకువచ్చింది. అయితే, భారత మార్కెట్ నాడిని పట్టుకున్న నథింగ్ ఇటీవలే రూ. 25,000 వేల రూపాయల సెగ్మెంట్ లో కూడా అడుగుపెట్టింది. Nothing Phone (2a) ను 25 వేల రూపాయల ప్రైస్ కేటగిరిలో విడుదల చేసి, ఈ సెగ్మెంట్ లో పట్టు సాధించింది. ఈ ప్రైస్ లో ఈ ఫోన్ కలిగిన ఫీచర్స్ మరియు వినూత్నమైన డిజైన్ తో యూజర్ల మనసు దోచుకున్న నథింగ్ మంచి అమ్మకాలు కూడా సాధించింది.

CMF Phone (1) Nothing

అందుకే, మరొక అడుగు ముందుకు వేసి రూ. 15,000 రూపాయల ఉప ధర కేటగిరిలో కూడా కొత్త ఫోన్ ను లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. నిప్పులేనిదే పొగరాదనట్లు ఈ వార్త కనుక నిజమే అయితే, త్వరలోనే నథింగ్ సబ్ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ వచ్చే అవకాశం ఉంటుంది.

Also Read: iQOO Z9X 5G: మే 16 న వస్తున్న కొత్త ఫోన్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

Nothing ఏమి చెబుతోంది?

అయితే, ఇవన్నీ కూడా వార్తల్లో వస్తున్న కథనాలు మరియు అంచనాలు మాత్రమే. ఈ విషయం గురించి నథింగ్ బ్రాండ్ నుండి ఎటువంటి అప్డేట్స్ లేదా న్యూస్ కానీ వెల్లడికాలేదు.

అయితే, ఈ ఫోన్ యొక్క కొన్ని అంచనా ఫీచర్స్ లను కూడా కొత్త రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. నథింగ్ తన ఉప బ్రాండ్ నుండి బడ్జెట్ ధర ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న చాలా స్మార్ట్ ఫోన్ లకు ధీటుగా ఉండేలా తీసుకురావచ్చని నివేదికలు చెబుతున్నాయి.

అయితే, నథింగ్ నుండి ఏదైనా అప్డేట్ అందుకునే వరకు ఇవన్నీ కూడా కేవలం అంచనాలు గా మాత్రమే పరిగణించాల్సి వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :