ఇటీవల ఇండియాలో పవర్ ఫుల్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ గా నథింగ్ (2a) తీసుకు వచ్చిన నథింగ్ బ్రాండ్, ఇప్పుడు దీని నెక్స్ట్ జనరేషన్ వెర్షన్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ యొక్క అధికారిక ‘X’ అకౌంట్ నుండి టీజర్ పోస్ట్ ను షేర్ చేసింది. ‘ఎక్స్ట్రాడినరీ కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది’ అని ఈ ఫోన్ గురించి హింట్ కూడా ఇచ్చింది.
నథింగ్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. నథింగ్ (2a) స్మార్ట్ ఫోన్ ను జూలై 31వ తేదీ భారత మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ ను చూస్తుంటే,ఈ అప్ కమింగ్ ఫోన్ ను మెటల్ బాడీ తో అందిస్తుందేమో అనే అనుమానం కలుగుతోంది. ఈ ఫోన్ కోసం నథింగ్ షేర్ చేసిన టీజర్ పోస్ట్ ను ఇక్కడ చూడవచ్చు.
భారత మార్కెట్ లో 25 వేల ఉప బడ్జెట్ లో మంచి సక్సెస్ సాధించిన నథింగ్ (2a) ఫోన్ నెక్స్ట్ లెవల్ ఫోన్ గా ప్లస్ వెర్షన్ ను తీసుకు వస్తోందంటే, ఈ ఫోన్ పైన ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి. ఎందుకంటే, నథింగ్ (2a) స్మార్ట్ ఫోన్ ను డ్యూయల్ 50MP కెమెరా మరియు ఐ క్యాచీ డిజైన్ తో అందించింది. అందుకే, ఈ అప్ కమింగ్ నథింగ్ ఫోన్ పై సర్వత్రా చర్చ మొదలవుతుంది.
Also Read: Honor 200 5G: స్టూడియో లెవల్ పోర్ట్రైట్ కెమెరాతో మిడ్ రేంజ్ ధరలో వచ్చింది.!
నథింగ్ (2a) ఫోన్ ను రూ. 23,999 ప్రారంభ ధరలో ప్రకటించింది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ను 120Hz 10 bit ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు vivid కలర్ ఫీచర్ తో అందించింది. నథింగ్ (2a) ఫోన్ లో 50MP + 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా, 4K వీడియో షూట్ సపోర్ట్ లను కలిగి వుంది.
నథింగ్ (2a) మీడియాటెక్ Dimensity 7200 Pro చిప్ సెట్ తో వచ్చింది. దీనికి జతగా 12GB ర్యామ్ + 8GB ర్యామ్ బూస్టర్ ఫీచర్లతో పాటు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి వుంది. నథింగ్ (2a) ఫోన్ 25 వేల ఉప బడ్జెట్ లో తగిన ఫీచర్స్ కలిగిన ఫోనుగా యూజర్ల నుంచి కితాబు అందుకుంది.
మరి నథింగ్ తన అప్ కమింగ్ ఫోన్ ను ఎటువంటి ఫీచర్స్ తో తీసుకు వస్తుందో చూడాలి.