Nothing (3a) Series: కొత్త సిరీస్ ఫోన్లు విడుదల చేస్తున్న నథింగ్.!

Nothing అప్ కమింగ్ సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసింది
Nothing (3a) Series ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు నథింగ్ అనౌన్స్ చేసింది
కీలక వివరాలు కంపెనీ ఒక్కొక్కటిగా బయటకు వెల్లడించే అవకాశం వుంది
Nothing (3a) Series: ఇప్పటికే 2a సిరీస్ నుంచి బడ్జెట్ ఫోన్ లను విడుదల చేసిన నథింగ్ ఇప్పుడు అప్ కమింగ్ సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసింది. నథింగ్ (3a) సిరీస్ ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు నథింగ్ అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ నుంచి రెండు ఫోన్ లను లాంచ్ చేసే అవకాశం ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే, ఇటీవల చేసిన రెండు టీజర్ ఇమేజస్ ద్వారా ఈ విషయం అర్ధం అవుతోంది.
Nothing (3a) Series: లాంచ్
నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నథింగ్ (3a) సిరీస్ ను మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు ఇండియాలో విడుదల చేస్తుందని ప్రకటించింది. ఈ సీరియస్ నుంచి నథింగ్ 3 మరియు (3a) విడుదల చేసే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. అయితే, ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా నెల రోజులు టైమ్ ఉంది కాబట్టి కీలక వివరాలు కంపెనీ ఒక్కొక్కటిగా బయటకు వెల్లడించే అవకాశం వుంది. ఈ ఫోన్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా ఉంటుంది.
Nothing (3a) Series: ఫీచర్స్
ఈ అప్ ఫోన్ సిరీస్ ఫోన్స్ యొక్క అంచనా ఫీచర్స్ మరియు రూమర్స్ ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ పెద్ద AMOLED స్క్రీన్ కలిగి ఉండే అవకాశం వుంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 చిప్ సెట్ తో అందించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ లావు ముందుగా అందించైన్ అదే డ్యూయల్ 50MP సెన్సార్ లను అందిస్తోందో లేకపోతే కొత్త సెటప్ అందిస్తోందో తెలియాల్సి వుంది. ఈ ఫోన్ లను 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించవచ్చని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
Also Read: రేపటితో ముగియనున్న Jio Limited Offer.. ఈ జబర్దస్త్ ఆఫర్ కోసం ఒక్కరోజే ఛాన్స్.!
అయితే, నథింగ్ అఫీషియల్ గా ప్రకటించే వరకు ఇవన్నీ కూడా అంచనా స్పెక్స్ గా మాత్రమే చూడాలి. ఈ ఫోన్ మరిన్ని అప్డేట్స్ ఓ మళ్ళీ కలుద్దాం.