ప్రస్తుతం స్మార్ట్ వాచ్ ల జోరు మార్కెట్ లా చాలా పోటీ గా ఉంది. కొనే వారు ఉన్నారో లేదో ఫిగర్స్ కనపడటం లేదు కాని స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల తో పాటు స్మార్ట్ వాచ్ కంపెనీలు కూడా ఒకరి మీద ఒకరు పోటీ గా దించుతున్నారు. అందరిలో వాకింగ్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ సేన్సర్స్ లాంటి కామన్ ఫీచర్స్ ఉన్నాయి, కాని Noodoe కొత్తగా బొమ్మలతో టైమ్ ను చూపించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇది డిఫెరెంట్ ఎప్రోచ్ కాని అంత సీరియస్ గా ఉపయోగపడే ఫీచర్ కాదు. అఫ్కోర్స్ అవసరాలు కోసం స్మార్ట్ డివైజ్ లను కొనే రోజులు పోతున్నాయి అనుకోండి.
Noodoe స్మార్ట్ వాచ్ లో చూపించే బొమ్మల డిస్ప్లే కి మీరు బొమ్మల్ని క్రియేట్ చేయవచ్చు. ప్లే స్టోర్ లో దొరికే Noodoe ఆప్ ను ఇంస్టాల్ చేసుకొని మీకు నచ్చిన బొమ్మను వేసి దాన్ని అప్లోడ్ చేసుకుంటే అది స్మార్ట్ వాచ్ పై టైమ్ పక్కన కనిపిస్తుంది. 32×128 పిక్సెల్ డిస్ప్లే ఎమోలేడ్ మరియు ఏక్టివ్ మ్యాట్రిక్స్ LED స్క్రీన్ తో వస్తుంది Noodoe స్మార్ట్ వాచ్. బొమ్మలను అనే కాకుండా మీరు ఏ గీతాలు గిసిన, మీ పేరు వ్రాసుకున్న, లేదా ఏమైనా ఫోటలను కూడా అప్లోడ్ చేసి డిస్ప్లే పై కనిపించేలా చేసుకోవచ్చు. యూజర్స్ క్రియేట్ చేసుకున్న బొమ్మలను క్లౌడ్ స్టోరేజ్ లో షేర్ చేసుకోవచ్చు.
ఇది చూడటానికి ట్రాకింగ్ ఫిట్ నేస్ బ్యాండ్ లా ఉంటుంది కాని, హార్ట్ రేట్, ఫుట్ స్టెప్స్ మరియు ఇతర సేన్సర్స్ దీనిలో లేవు. కాని కేవలం చేతిని మీరు ముందే సెట్ చేసుకున్న డైరెక్షన్ లో కదిపితే మీ స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్స్ ను దీని డిస్ప్లే పై చూసుకునే ఫీచర్ ఉంది. అలాగే కాల్స్ ను సైలెంట్ చేసే ఫీచర్ కూడా ఉంది.
Noodoe స్మార్ట్ వాచ్ ధర సుమారు రూ.6500 లోపు ఉంటుంది. 2015 4th క్వార్టర్ లో విడుదల అవుతుంది అని అంచనా. ఇది ఐ os లో కూడా త్వరలో ఆప్ ను రిలీజ్ చేయనుంది.