నోకియా 3 మంచిదా REDMI 4 మంచిదా

Updated on 15-Jun-2017
HIGHLIGHTS

మొన్నే నోకియా నుంచి 3,5,6 స్మార్ట్ఫోన్స్ లాంచ్ అయ్యాయి

మొన్నే  నోకియా నుంచి 3,5,6 స్మార్ట్ఫోన్స్  లాంచ్ అయ్యాయి వీటిలో నోకియా 6 ఆన్లైన్  లో లభిస్తుంది .  కానీ మిగతా  ఫోన్ లు  ఆఫ్  లైన్  లో లభ్యమవుతున్నాయి .  అయితే నోకియా 3 నోకియా  ఫోన్ లలోనే  చవకైన  స్మార్ట్ ఫోన్ , ఇది REDMI 4 స్మార్ట్ ఫోన్ కి గట్టిపోటీ  అంటున్నారు కానీ స్పెక్స్ పరంగా  చూస్తే రెండిటిలో చాలా  అంతరం  కనిపిస్తుంది. ఎందుకంటే నోకియా 3 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్ పై రన్ అయితే  షియోమీ రెడ్మీ 4 క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్ పై రన్ అవుతుంది.  ఇక వీటి ఆపరేటింగ్ సిస్టమ్స్  చూస్తే మరియు నోకియా 3 ఫోన్ ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. షియోమీ రెడ్మీ 4 ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.  మరియు RAM  అండ్ స్టోరేజ్  లలో కూడా చాలా  తేడా  వుంది. నోకియా 3: 2జీబి RAM  అండ్ , 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఇక షియోమీ రెడ్మీ 4: RAM  వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి). నోకియా 3 మోడల్ 2,630 mAh బ్యాటరీతో వస్తోంది. షియోమీ రెడ్మీ 4 మోడల్ 4,100 mAh బ్యాటరీతో వస్తోంది.నోకియా 3 ధర రూ.9,499 షియోమీ రెడ్మీ 4 ప్రారంభ వేరియంట్ ధర రూ.6,999.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :