నోకియా 3 మంచిదా REDMI 4 మంచిదా
మొన్నే నోకియా నుంచి 3,5,6 స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అయ్యాయి
మొన్నే నోకియా నుంచి 3,5,6 స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అయ్యాయి వీటిలో నోకియా 6 ఆన్లైన్ లో లభిస్తుంది . కానీ మిగతా ఫోన్ లు ఆఫ్ లైన్ లో లభ్యమవుతున్నాయి . అయితే నోకియా 3 నోకియా ఫోన్ లలోనే చవకైన స్మార్ట్ ఫోన్ , ఇది REDMI 4 స్మార్ట్ ఫోన్ కి గట్టిపోటీ అంటున్నారు కానీ స్పెక్స్ పరంగా చూస్తే రెండిటిలో చాలా అంతరం కనిపిస్తుంది. ఎందుకంటే నోకియా 3 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్ పై రన్ అయితే షియోమీ రెడ్మీ 4 క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఇక వీటి ఆపరేటింగ్ సిస్టమ్స్ చూస్తే మరియు నోకియా 3 ఫోన్ ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. షియోమీ రెడ్మీ 4 ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. మరియు RAM అండ్ స్టోరేజ్ లలో కూడా చాలా తేడా వుంది. నోకియా 3: 2జీబి RAM అండ్ , 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఇక షియోమీ రెడ్మీ 4: RAM వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి). నోకియా 3 మోడల్ 2,630 mAh బ్యాటరీతో వస్తోంది. షియోమీ రెడ్మీ 4 మోడల్ 4,100 mAh బ్యాటరీతో వస్తోంది.నోకియా 3 ధర రూ.9,499 షియోమీ రెడ్మీ 4 ప్రారంభ వేరియంట్ ధర రూ.6,999.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile