నోకియా X7 స్మార్ట్ ఫోన్ ని ఒక 6.18 ప్యూర్ డిస్ప్లే టెక్నాలజీ, HDR 10 సపోర్ట్ మరియు స్నాప్ డ్రాగన్ 710 చిప్సెట్ తో ఆవిష్కరించింది
HMD గ్లోబల్ నోకియా X7 యొక్క మూడు వేరియంట్లను ఆవిష్కరించింది : 4GB ర్యామ్ + 64GB స్టోరేజి, 6GB ర్యామ్ + 64GB స్టోరేజి మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజి.
చాలా లీకులు మరియు పుకార్ల తరువాత ఎట్టకేలకు, HMD గ్లోబల్ తన నోకియా X7 స్మార్ట్ ఫోన్నిచైనాలో విడుదల చేసింది. నోకియా X5 మరియు నోకియా X6 ఇండియాతో పాటు కొన్ని ఇతర దేశాలలో నోకియా 5.1ప్లస్ మరియు నోకియా 6.1ప్లస్ వంటి ఫోన్లకు, వారసునిగా ఈ ఫోన్ వచ్చింది. ఈ వరుస క్రమంలో, ఈ నోకియా X7 గ్లోబల్ మార్కెట్లో, నోకియా 7.1 గా విడుదల కావచ్చు . చైనా కాకుండా, గ్లోబల్ మార్కెట్లో ఈ ఫోన్ ని ఆండ్రాయిడ్ వన్ కార్యక్రమంలో భాగంగా చేయనుంది, ఈ ఫిన్నిష్ టెక్ కంపెనీ.
HMD గ్లోబల్ ఈ నోకియా X7 యొక్క మూడు వేరియంట్లను విడుదల చేసింది
1. 4GB ర్యామ్ + 64GB స్టోరేజి వేరియంట్ ధర CNY 1,699 (సుమారుగా Rs. 18,000)
2. 6GB ర్యామ్ + 64GB స్టోరేజి వేరియంట్ ధర CNY 1,999 (సుమారుగా Rs. 21,000)
3. 6GB ర్యామ్ + 128GB స్టోరేజి వేరియంట్ ధర CNY 2,499 (సుమారుగా Rs. 26,500)
నోకియా 7X ప్రత్యేకతలు
ఈ నోకియా X7 ఎడ్జ్-టూ-ఎడ్జ్ ప్యూర్ డిస్ప్లే తో HDR 10కి సపోర్ట్ చేసే ఒక 6.18 అంగుళాల డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 86.5 బాడీ-టూ-స్క్రీన్ రేషియాతో ఒక 18.7:9 యాస్పెక్ట్ రేషియాతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ఒక డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగివుంటుంది 2.5D కర్వ్డ్ గ్లాసుతో. ఇది ఆక్టా కోర్ క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ శక్తితో నడుస్తుంది మరియు ఈ స్మార్ట్ ఫోన్ అత్యధికంగా మైక్రో SD కార్డు ద్వారా విస్తరించగల 400GB స్టోరేజితో, 6GB ర్యామ్ + 128GB స్టోరేజి వరకు సపోర్ట్ చేస్తుంది.
ఈ నోకియా X7 ఫోన్ యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది f/1.8ఆపేర్చేర్ గల IMX363 సెన్సార్ యొక్క 13MP ప్రధాన కెమేరా మరియు Zeiss ఆప్టిక్స్ గల ఒక 12MP రెండవ కెమేరాతో జతగా వస్తుంది. ముందు భాగంలో, f/2. ఆపేర్చేర్ గల ఒక 20MP కెమేరాని కలిగి ఉంటుంది. ఒక 3,500 mAh సామర్ధ్యం గల బ్యాటరీ ఈ ఫోన్ మొత్తానికి శక్తినందిస్తుంది మరియు 18వాట్స్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.