నోకియా నుండి మరొక ప్రీమియం 5G స్మార్ట్ ఫోన్ వచ్చింది. Nokia X30 5G పేరుతో స్మార్ట్ ఫోన్ ను నోకియా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప ఎకో-ఫ్రెండ్లీ ఫోన్ అని నోకియా పొగుడుతోంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ ను 33 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు పెద్ద AMOLED డిస్ప్లే తో పాటుగా మంచి కెమేరా సిస్టంతో అందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ లేటెస్ట్ నోకియా 5G ఫోన్ యొక్క ధర మరియు స్పెక్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
Nokia X30 5G ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.48,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఐస్ వైట్ బ్లాక్ క్లౌడ్ బ్లూ రెండు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ నోకియా స్టోర్ మరియు అమెజాన్ నుండి సేల్ అవుతుంది మరియు ప్రస్తుతం Pre-Orders కి అందుబాటులో వుంది. ఈ ఫోన్ తో పాటుగా నోకియా కంఫర్ట్ ఇయర్ బడ్స్ మరియు 33W ఫాస్ట్ చార్జర్ ను ఉచితంగా కంపెనీ అఫర్ చేస్తోంది.
Nokia X30 5G స్మార్ట్ ఫోన్ Snapdragon 695 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ కి జతగా 8 జీబీ ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ పెద్ద 6.43 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే రక్షణ కోసం పైన గొరిల్లా గ్లాస్ విక్టస్ ని కంపెనీ అందించింది. ఈ ఫోన్ లో 4,200 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించింది.
నోకియా ఎక్స్ 30 5G లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 50MP ప్రధాన కెమెరా మరియు 13MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 16 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వుంది. ఈ స్మార్ట్ ఫోన్ f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ముఖ్యంగా, ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ బెడదా లేని Android 12 OS పైన నడుస్తుంది మరియు 3 మేజర్ OS అప్డేట్స్ ను అందుకుంటుందని కంపెనీ తెలిపింది.