నోకియా రెంటల్ సర్వీస్: ఈ ప్రీమియం ఫోన్ అద్దెకు ఇస్తామంటున్న నోకియా.!

నోకియా రెంటల్ సర్వీస్: ఈ ప్రీమియం ఫోన్ అద్దెకు ఇస్తామంటున్న నోకియా.!
HIGHLIGHTS

ఈ ప్రీమియం ఫోన్ అద్దెకు ఇస్తామంటున్న నోకియా

రెంట్ చెల్లించి ఫోన్ ఉపయోగించుకోవచ్చని నోకియా చెబుతోంది

Nokia X30 5Gని అద్దెకు తీసుకొని ఉపయోగించవచ్చు

నోకియా రెంటల్ సర్వీస్: ఈ ప్రీమియం ఫోన్ అద్దెకు ఇస్తామంటున్న నోకియా.  నోకియా ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే, రెంట్ చెల్లించి ఉపయోగించుకోవచ్చని, నోకియా చెబుతోంది. అంటే, నోకియా తీసుకువస్తున్న ఈ కొత్త అవకాశంతో మీరు కేవలం నామమాత్రపు అద్దెను చెల్లించి ప్రీమియం ఫోన్ ను అద్దెకు తీసుకొని వాడుకోవచ్చన్న మాట. సంచలనాలకు పేరైన నోకియా ఇప్పుడు ఈ సరికొత్త వినూత్న ప్రయోగంతో ముందుకు వచ్చింది మరియు  వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ ను తీసుకువస్తోంది.

ఈ ఆఫర్ తో కంపెనీ యొక్క పర్యావరణ అనుకూల స్మార్ట్‌ ఫోన్ Nokia X30 5Gని అద్దెకు తీసుకొని ఉపయోగించవచ్చు. ఈ కొత్త ఆలోచన తాలూకు వివరాలేమిటో తెలుసుకుందామా. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, $ 520 (సుమారు రూ.42,300) విలువైన Nokia X30 5G స్మార్ట్ ఫోన్ ను నెలకు $ 25 చెల్లించి, అంటే దాదాపు రూ. 2,033 చెల్లించి అద్దెకు తీసుకోవచ్చు. అయితే, ఈ రెంటల్ సర్వీస్ ను మీరు కనీసం మూడు నెలల పాటు ఉపయోగించాల్సి ఉంటుందని నోకియా చెబుతోంది. అంతేకాదు, ఈ సర్వీస్  సమయంలో ఫోన్ కోల్పోయిన లేదా పాడైన ఆ స్మార్ట్‌ ఫోన్‌ లను తిరిగి కంపెనీ భర్తీ చేస్తుంది, అని కూడా చెబుతోంది.

ప్రస్తుతానికి ఇతర దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ సర్వీస్ ను నోకియా త్వరలోనే భారతదేశంలో కూడా పరిచయం చేయబోతోంది. అంటే, అద్దెకు 5G ఫోన్ సర్వీస్ ను  భారతీయ వినియోగదారులకు కూడా అందిస్తుందని భావిస్తున్నారు. నోకియాకు చెందిన ఈ ఎకో ఫ్రెండ్లీ ఫోన్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం పదండి.

Nokia X30 5G: స్పెక్స్

నోకియా X30 5G స్మార్ట్ ఫోన్ 6.43-అంగుళాల FHD + డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. Nokia X30 5G స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రోసెసర్ కి జతగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ 5G ఫోన్ అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు Android 12 OS ఆపిన రాం అవుతుంది.

కెమెరా విభాగంలో, ఈ నోకియా 5G ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా జతగా 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా వుంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4200mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo