నోకియా స్మార్ట్ ఫోన్స్ మరలా రానున్నాయని అని మనకు తెలుసు. కాని దీనిపై ఒక కన్ఫర్మేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. నోకియా
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో నోకియా సీఈఓ – రాజీవ్ సూరి లేటెస్ట్ గా, కంపెని స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ఫ్యూచర్ లో రి ఎంట్రీ ఇవనుంది అని కన్ఫర్మ్ చేయటం జరిగింది .
అయితే ఇది ఎప్పుడనే దానిపై ఒక క్లారిటీ ఇవ్వలేదు ఈ Finnish కంపెని (నోకియా). రాజీవ్ సూరి ఎప్పుడూ రానుంది అనే విషయంలో ప్రత్యేకంగా ఒక టైమ్ లైన్ మరియు తొందర కూడా పడటం లేదు కంపెని. ఈ ఇయర్ లేదా తరువాత ఎప్పుడైనా రావచ్చు అని అన్నారు.
మార్కెట్ లోకి రి ఎంట్రీ ఇచ్చే ముందు సరైన పార్టనర్ షిప్ కోసం wait చేస్తుంది కంపెని. అలాగే కంపెని ఫోనులను తయారు చేయదు కాని లైసెన్స్ నేమ్ ను మాత్రం పార్టనర్స్ కు ఇస్తుంది.