Nokia తన కొత్త ReefShark 5G చిప్ సెట్ విడుదల…..
నోకియా తన కొత్త ReefShark 5G చిప్సెట్ ని విడుదల చేసింది. కంపెనీ లేటెస్ట్ ReefShark చిప్సెట్ నుండి తరువాతి తరం యొక్క మొబైల్ నెట్వర్క్ ని సృష్టించడానికి 30 కెరీర్ తో భాగస్వామిగా ఉంది. ఇది తక్కువ ధరలకు మెరుగైన అనుభవాన్ని అందించగలదని భావిస్తున్నారు.
కొత్త ReeffShark చిప్సెట్ ప్లగ్-ఇన్ యూనిట్ గా పరిచయం చేయబడింది, ఇది ప్రస్తుత నోకియా ఎయిర్ స్కేప్ బ్యాండ్బ్యాండ్ మాడ్యూల్ కి జోడించబడింది .ఒక సెల్ 84 Gbps మొబైల్ డేటాను పుష్ చేయవచ్చు మరియు మల్టిపుల్ (చాలా ఎక్కువ) సెల్స్ మొత్తం 6 Tbps డేటాను పుష్ చేస్తుంది. పెద్ద పట్టణాల దట్టమైన ప్రాంతాలకు ఇది చాలా ముఖ్యమైనది.
ఈ సెటప్లు పోర్ర్తీగా నెట్వర్క్ స్లయిసింగ్ కి మద్దతును అందిస్తాయి, ఇది వర్చ్యువల్ నెట్వర్కు ఆపరేటర్లను హార్డ్వేర్ను పంచుకోవడానికి అనుమతిస్తుంది. ఈ సంవత్సరం యొక్క మూడవ క్వార్టర్ లో న్యూ ReefSharks చిప్సెట్ అందుబాటులో ఉంటుంది.