నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ బేసిక్ ఫోన్స్ వస్తున్నాయి.

Updated on 19-May-2016

నోకియా కంపెని, నోకియా మొబైల్స్ అండ్ టాబ్లెట్స్ తో మార్కెట్ లోకి రిటర్న్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది. ఇందుకు సంబందించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా జరిగింది దాదాపు.

నోకియ టెక్నాలజీస్ బ్రాండ్ ప్రోపర్టీ రైట్స్ HMD Global(Finland కంపెని) కు ఇచ్చింది నోకియా. సో HMD, 10 ఇయర్స్ వరకూ నోకియా బ్రాండెడ్ ఫోన్స్ అండ్ టాబ్లెట్స్ తయారు చేస్తుంది.

ప్రోడక్ట్ సేల్స్ బట్టి నోకియ కు HMD నుండి royalty పేమెంట్స్ అందుతాయి. ఇవి గూగల్ ఆండ్రాయిడ్ os పై రన్ అవుతాయి.

కేవలం స్మార్ట్ ఫోన్స్ ఒకటే కాదు feature(బేసిక్) నోకియా ఫోన్స్ కూడా తయారు చేస్తుంది HMD. డిజైన్ పరంగా కూడా మైక్రో సాఫ్ట్ నుండి కొన్ని రైట్స్ తీసుకుంది HMD.

మైక్రో సాఫ్ట్ తో కంప్లీట్ అగ్రిమెంట్ 2016 సెకెండ్ క్వార్టర్ లో క్లోజ్ కానుంది. వచ్చే 3 సంవత్సరాలకు నోకియా బ్రాండ్ ప్రోడక్ట్స్ ను తయారు చేయటానికి HMD కంపెని 500$ మిలియన్స్ ను ఇన్వెస్ట్ చేస్తుంది.

నోకియా క్వాలిటీ ను తగ్గకుండా ఉంచటానికి ఇక నుండి HMD బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లలో నోకియా, తమ బ్రాండ్ reequirements మరియు పెర్ఫార్మన్స్ రిలేటెడ్ నిబంధనలను తెలియజేస్తుంది.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :