ఇండియన్ ఓల్డ్ ఫేవరేట్ మొబైల్ బ్రాండ్, నోకియా 2016 సెకెండ్ హాఫ్ లో తన బ్రాండ్ ను మళ్ళీ లైసెన్స్ చేయనుంది. నోకియా బ్రాండ్ పేరుతో ధర్డ్ పార్టీ తయారిదరుని తో కలిపి ఫోనులను తయారు చేస్తుంది. ఒక జర్మన్ ఇంటర్వ్యూ లో , నోకియా CEO, రాజీవ్ సూరి ఈ విషయాన్ని చెప్పారు.
2013 సంవత్సరం లో నోకియా ను మైక్రోసాఫ్ట్ కొనేసింది. కాని అప్పటి నుండి ఇప్పటి వరకూ మైక్రోసాఫ్ట్ మొబైల్ మార్కెట్ లో ఎటువంటి కీలకమైన స్థానాన్ని సంపాదించుకోలేక పోయింది. వరల్డ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేర్ లో కేవలం 3% ను సొంతం చేసుకోగలిగింది మైక్రోసాఫ్ట్.
మైక్రోసాఫ్ట్ నోకియను కొన్నాక మళ్ళీ ఎలా మొబైల్ మార్కెట్ లోకి వస్తుంది?
2013 లో రెండు కంపెనీలు చేసుకున్న ఒప్పొండం ప్రకారం, 2016 సంవత్సరం 2nd క్వార్టర్ వరకూ నోకియా మొబైల్ బిజినెస్ మార్కెట్ కు దూరంగా ఉంటుంది. ఈ డీల్ ప్రకారం నోకియా తిరిగి తన లైసెన్స్ ను రీ రిజిస్టర్ చేసుకోగలదు కాని డైరెక్ట్ గా ఫోనులను తయారు చేయలేదు. అంటే 2016 లో నోకియా బ్రాండ్ పేరుతో మోబైల్స్ వస్తాయి కాని అవి థర్డ్ పార్టీ కంపెని తయారీలో ఉంటాయి. ఇదే పద్దతితో అనుసరిస్తుంది ఐ ఫోన్ కూడా.
ప్రస్తుతం తమతో పనిచేసేందుకు సరైన పార్టనర్స్ కోసం వెతుకుతుంది నోకియా. ఇప్పటికే Nokia N1 పేరుతో ఒక టాబ్లెట్ ను కూడా లాంచ్ చేసింది నోకియా. దానికి Foxconn తయారిదారుడు. Foxconn ఆపిల్ డివైజ్ లను తయారు చేసే కంపెని. తాజగా నోకియా Alcatel-Lucent మొబైల్ బ్రాండ్ ను 17.8 బిలియన్ డాలర్స్ కు కొన్నాది.
ఆధారం: Manager Magazine