Nokia స్మార్ట్ఫోన్ మరియు యాక్ససరీస్ ఇప్పుడు భారతదేశంలో కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్లో కూడా అందుబాటులో….

Updated on 22-Mar-2018

భారతదేశం యొక్క అధికారిక వెబ్ సైట్ నుండి నోకియా స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లు మరియు ఇతర యాక్ససరీస్ ను కొనుగోలు చేయడానికి HMD గ్లోబల్ ఇప్పుడు మీకు అవకాశాన్ని కల్పిస్తోంది, దీని అర్థం మీరు ఇప్పుడు భారతదేశంలో కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి ఈ డివైసెస్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో అధికారిక వెబ్ సైట్ లో తన ప్రోడక్ట్స్ ను అన్ని లిస్ట్ లో చేర్చింది, అయినప్పటికీ వాటిని అన్ని ప్రస్తుతం కొనుగోలు కోసం అందుబాటులో లేనప్పటికీ. వీటిలో కొన్ని మాత్రమే మీరు కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం నోకియా 8, నోకియా 5, నోకియా 3 మరియు నోకియా 2 స్మార్ట్ఫోన్లు స్మార్ట్ఫోన్ విభాగంలో కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, ఈ లిస్ట్ లో నోకియా 6 (2017) మరియు నోకియా 6 (2018) స్మార్ట్ఫోన్లు కూడా లిస్ట్  చేయబడ్డాయి, అయితే ప్రస్తుతానికి ఇవి  కొనుగోలు కోసం అందుబాటులో లేవు.

నోకియా 3310 డ్యూయల్ సిమ్, నోకియా 150 డ్యూయల్ సిమ్, నోకియా 105 డ్యూయల్ మరియు సింగిల్ సిమ్, నోకియా 230 డ్యూయల్ సిమ్, నోకియా 130, నోకియా 216 డ్యూయల్ సిమ్ ఫోన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే కంపెనీ  తరఫున పరిచయం అయినప్పటికీ, నోకియా 8810 4G ఫోన్ ఈ లిస్ట్ లో చేర్చబడలేదు.

మీరు యాక్ససరీస్  గురించి చర్చించినట్లయితే, కంపెనీ తన కేస్ , ఛార్జర్, USB కేబుల్, మరియు ఇన్-ఎయిర్ హెడ్ఫోన్లను ఇక్కడ కలిగి ఉంది. అయినప్పటికీ ఈ యాక్ససరీస్   ఏవీ కొనుగోలు కి అందుబాటులో లేవు.

 

 

Connect On :