మనిషిలోకి వెళ్ళకుండా ఒక బులెట్ ను ఆపిల్ నోకియా 301 ఫోన్: అఫీషియల్
నోకియా స్మార్ట్ ఫోన్ అనే కాదు, బేసిక్ ఫోన్స్ కు కూడా చాలా మంది ఫాన్స్ ఉంటారు. అయితే అది వాటి క్వాలిటీ వలన లేదా అవి గతంలో ఉండే memories లో భాగం అవటం వలనో తెలియదు కాని…
రీసెంట్ గా బేసిక్ ఫోన్ ఉండటం వలన ఒక వ్యక్తి చావు నుండి బయట పడ్డాడు. విషయం లోకి వెళ్తే, afghanistan లోని ఒక వ్యక్తి పాకెట్ లో నోకియ 301 బేసిక్ ఫోన్ కు బులెట్ తగిలి అతని శరీరం లోకి చొచ్చుకుపోకుండా ఆగిపోయింది.
ఎందుకు తగిలింది వంటి విషయాలపై స్పష్టం చేయలేదు కాని ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ విండోస్ డెస్క్ టాప్, టాబ్లెట్ అండ్ ఫోన్ లకు Core UX జనరల్ మేనేజర్ అయిన పీటర్ తన ట్విటర్ లో తెలిపారు. క్రింద అతని ట్వీట్ తో పాటు బులెట్ తగిలిన ఫోన్ చూడగలరు.
గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ వేరే నోకియా ఫోనులతో కూడా జరిగాయి. నోకియ లుమియా 520 కూడా బులెట్ ను ఆపింది. అయితే వేరే బ్రాండ్స్ లో కూడా ఇలాంటివి జరిగాయి. ఐ ఫోన్ 5C, HTC Evo 3D..
A Nokia phone I worked on a few years ago saved the life of a man in Afghanistan last week. The embedded bullet…. pic.twitter.com/O2zBxadkDO
— peter skillman (@peterskillman) October 5, 2016
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile