నోకియా శకం మళ్ళి మొదలు
నోకియా రీఎంట్రీ
బాస్ ఈస్ బ్యాక్ అన్నట్లుగా నోకియా సరికొత్త ఫోన్స్ తో మల్లి మార్కెట్ లో సందడి చేయబోతుంది. ఇంతకూ మూడు విండోస్ ఫోన్స్ జనాదరణ కోల్పోయి తన ఉనికిని లేకుండా చేసుకుంది కానీ మల్లి ఆండ్రాయిడ్ బాటపట్టి తన ఉనికి చాటుకొనేందుకు సర్వ సన్నాహాలు చేస్తోంది . దానిలో , MWC 2017తో మార్కెట్ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది.
ఫిబ్రవరి 26న ఓ ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌ను కూడా నోకియా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా నోకియా పీ1, నోకియా 8, నోకియా డీ2సీ, నోకియా 3, నోకియా 3310 వంటి ఫోన్‌లతో పాటు పలు హెల్త్ డివైసెస్, వీఆర్ హెడ్‌సెట్‌లను కూడా లాంచ్ చేసేందుకు HMD గ్లోబల్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం . ఈ ప్రీ MWC ఈవెంట్‌ను నోకియా లైవ్ స్ట్రీమ్ చేస్తోంది. . Nokia OZO ద్వారా ఈ కార్యక్రమాన్ని 360 డిగ్రీ తో చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇదే సమయంలో నోకియా యూట్యూబ్ ఛానల్ కూడా ఈ కార్యక్రమాన్ని 3డీ ఫార్మాట్ లో లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. నోకియా అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో కూడా ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేయబోతున్నట్లు సమాచారం