HMD Global యాజమాన్యంలోని Nokia బ్రాండ్ ఇండియాలో Nokia 5G smartphone లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ Nokia 5G smartphone ను ఇండియాలో సెప్టెంబర్ 6వ తేదీ, అంటే రేపు విడుదల చేయనున్నట్లు తెలిపింది. నోకియా అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ ట్వీట్ చేసింది మరియు ఈ ఫోన్ స్పీడ్ గురించి గొప్పగా చెబుతోంది.
ఈ అప్ కమింగ్ 5G స్మార్ట్ ఫోన్ గురించి నోకియా ప్రస్తుతానికి ఎటువంటి వివరాలను అందించ లేదు కానీ, ఫోన్ స్పీడ్ గురించి పొగుడుతూ టీజింగ్ ట్వీట్ ను మాత్రం పోస్ట్ చేసింది. ఈట్వీట్ నుండి Nokia 5G smartphone తో స్పీడ్ ను ఎక్స్ పీరియన్స్ చెయ్యడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని ఊరిస్తోంది. ఈ ట్వీట్ ను మీరు క్రింద చూడవచ్చు.
https://twitter.com/NokiamobileIN/status/1697829223749333328?ref_src=twsrc%5Etfw
Read Also : భారీ 24GB RAM తో వచ్చిన ఈ Latest Smartphones గురించి మీకు తెలుసా.!
నోకియా ఇప్పటి వరకూ G మరియు X సిరీస్ ల నుండి మాత్రమే 5G Smartphone లను విడుదల చేసింది. ఇందులో Nokia 60 5G మరియు Nokia X30 5G రెండు ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా మంచి బిల్డ్ మరియు రీసైకిలింగ్ మెటీరియల్ తో వచ్చాయి. అయితే, నోకియా ఇప్పులు కొత్తగా లాంచ్ చేయబోతున్న 5G smartphone ఏ సిరీస్ నుండి లాంచ్ చేస్తుందో చూడాలి.
అయితే, గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో X సిరీస్ నుండి Nokia X30 5G లాంచ్ చేసింది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇదే సిరీస్ నుండి నెక్స్ట్ జెనరేషన్ 5G ఫోన్ ను లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
కానీ, ఇండియన్ బడ్జెట్ యూజర్లను టార్గెట్ గా చేసుకొని Nokia C Series నుండి మొదటి బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా చెబుతున్నాయి. అయితే, ఇదంతా కూడా వారి వారి అంచనాలే కానీ, నోకియా మాత్రం ఇప్పటి వరకూ ఈ ఫోన్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటనా చెయ్యలేదు.
రేపు Launch తరువాత ఈ New Nokia 5G smartphone ఏమిటి, ఎలా వుంది మరియు ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏమిటో తెలుస్తుంది.