HMD Global ఇండియాలో అతి తక్కువ ధరలో తీసుకు వచ్చిన లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ Nokia G42 5G యొక్క New 16GB RAM వేరియంట్ ను కూడా లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇందియాన్ మార్కెట్లో నడుస్తున్న బడ్జెట్ 5G Smartphone రేస్ లో నోకియా కూడా ఈ ఫోన్ తో పాలుపంచుకుంది. ముందుగా, కేవలం ప్రీమియం ధరలో మాత్రమే 5G ఫోన్ లను అందించిన అమేజాన్, నోకియా g42 5g స్మార్ట్ ఫోన్ ను మొదటిసారిగా బడ్జెట్ ధరలో అందించింది.
ప్రస్తుతం నోకియా జి42 5జి ఫోన్ 6 GB ర్యామ్ + 128GB స్టోరేజ్ తో రూ. 11,999 ధరతో లభిస్తోంది. అయితే, బడ్జెట్ ధరలో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో మంచి రెస్పాన్స్ అందుకోవడంతో , నోకియా కొత్త 8GB ర్యామ్ వేరియంట్ ను కూడా లాంచ్ చేసినట్లు చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ ఇప్పుడు పింక్ కలర్ లో కూడా లభిస్తుంది.
ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన వేరియంట్ 8GB ర్యామ్ + 8GB వర్చువల్ ర్యామ్ తో టోటల్ 16GB ర్యామ్ మరియు 256 GB స్టోరేజ్ తో రూ. 16,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ కొత్త వేరియంట్ రిటైల్ స్టోర్స్ నుండి సేల్ కి అంధుబాటులోకి వచ్చింది.
Also Read : ప్రీమియం Speakers పైన Amazon GIF Sale భారీ డీల్స్.!
నోకియా జి42 5జి స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ కేవలం ర్యామ్ మరియు స్టోరేజ్ లలో మాత్రమే మార్పులను కలిగి ఉంటుందే తప్ప మిగిలిన అన్ని ఫీచర్లు కూడా ఒకేవిధంగా ఉంటాయి. ఈ ఫోన్ 6.56 ఇంచ్ 90Hz రిఫ్రెష్ రేట్ HD+ డిస్ప్లే Gorilla Glass 3 ప్రొటెక్షన్ తో కలిగి ఉంటుంది. ఈ నోకియా ఫోన్ Snapdragon 480+ 5G ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256 GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి వుంటుంది.
ఈ నోకియా 5G స్మార్ట్ ఫోన్ 50 MP (AF) మెయిన్ సెన్సార్ + 2 MP డెప్త్ సెన్సార్ + 2 MP మ్యాక్రో సెన్సార్ లతో ట్రిపుల్ రియర్ కెమేరాని మరియు ముందు సెల్ఫీ కెమేరాని కలిగి వుంది. ఈ నోకియా ఫోన్ లో OZO Playback, OZO 3D Audio recording, FM radio ఫీచర్స్ తో పాటుగా 20W ఫాస్ట్ కెహెరింగ్ కి సపోర్ట్ చేసే 5,000 mAh బ్యాటరీ కూడా వుంది.
ఈ నోకియా 5జి స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13OS పైన పనిచేస్తుంది మరియు 2 OS upgrades ను అందుకుంటుందని నోకియా తెలిపింది.