నోకియా స్మార్ట్ ఫోన్ ను తక్కువ ధరలో కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇండియాలో నోకియా తన లేటెస్ట్ డ్యూయల్ కెమేరా స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ ధరలో విడుదల చేసింది. అదే, Nokia C22 స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 8 వేల రూపాయల ఉప బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్ లో చేసింది నోకియా. ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన ఈ నోకియా స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
నోకియా ఈ Nokia C22: స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మర్కెట్ లో రూ. 7,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 2GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం నిర్ణయించిన ధర మరియు 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ ధర ను రూ. 8,499 గా నిర్ణయించింది. ఈ ఫోన్ పైన నోకియా అందించి ఆఫర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ తో జియో యూజర్లు రూ. 3,500 రూపాయల విలువైన అదనపు ప్రయోజనాలను అందుకోవచ్చని నోకియా తెలిపింది.
నోకియా సి22 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD డిస్ప్లేని (720×1600) రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే డిస్ప్లే కంటెంట్ ను వీక్షించడానికి వీలుగా పొడవుగా ఉంటుంది. ఈ ఫోన్ Unisoc SC9863A ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది. దీనితో పాటుగా 2/4GB ర్యామ్ మరియు 2GB వర్చువల్ RAM సపోర్ట్ కూడా వుంది.
ఈ ఫోన్ లో వెనుక 13 MP + 2 MP డ్యూయల్ కెమేరా వుంది మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరాని అందుకుంటారు. నోకియా ఈ స్మార్ట్ ఫోన్ రియర్ కెమేరాతో పోర్ట్రైట్, HDR మరియు నైట్ మోడ్ ఫీచర్లను అందించింది. ఈ ఫోన్ Android 13 (Go edition) పైన పని చేస్తుంది. అయితే, ఈ ఫోన్ పైన క్వార్ట్రర్లి సెక్యూరిటీ అప్డేట్స్ మినహా మేజర్ అప్డేట్ అందుకునే అవకాశం లేదని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ IP52 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.
బడ్జెట్ ధరలో స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ మరియు డ్యూయల్ కెమేరా కోరుకునే వారి కోసం ఈ నోకియా ఫోన్ బడ్జెట్ ధరలో మంచి ఎంపిక కావచ్చు.