ఇండియన్ మార్కెట్ లో Nokia New Phone ను నోకియా 105 క్లాసిక్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం వెయ్యి రూపాయల లోపే మరిన్ని ఫీచర్లతో ఈ కొత్త ఫీచర్ ఫోన్ ను తీసుకురావడం విశేషం. ఈ ఫోన్ లో UPI payment ఫీచర్ మరియు తగిన ఇతర ఫీచర్లతో నోకియా తీసుకు వచ్చింది. వెయ్యి రూపాయల ధరలో కొత్త ఫీచర్ ఫోన్ చూస్తున్న వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది. మరి భారత్ లో నోకియా లాంచ్ చేసిన ఈ కొత్త ఫీచర్ ఫోన్ మరియు దాని వివరాలు ఏమిటో చూద్దామా.
నోకియా కొత్తగా లాంచ్ చేసిన ఫీచర్ ఫోన్ నోకియా 105 క్లాసిక్ ఫీచర్ ఫోన్ రూ. 999 ధరలో ప్రకటించింది మరియు ఈ ఫోన్ బ్లూ మరియు చార్కోల్ బ్లాక్ కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్స్ ను క్రింద చూడవచ్చు.
Also Read : Amazon Finale Days సేల్ నుండి Xiaomi స్మార్ట్ టీవీ పైన ధమాకా అఫర్.!
నోకియా 105 క్లాసిక్ ఫీచర్ ఫోన్ ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయాలు రెండు. ఈ ఫోన్ ను ఒక సంవత్సరం రీప్లేస్మెంట్ గ్యారింటీతో అందించడం మొదటి ముఖ్యమైన విషయం అయితే, ఆన్లైన్ పేమెంట్ కోసం UPI పేమెంట్ ఫీచర్ ను ఈ ఫోన్ లో అందించడం మరొక ముఖ్యమైన విషయం.
ఈ ఫోన్ లో 800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది మరియు సింగిల్ ఛార్జ్ తో రోజుల తరబడి పని చేస్తుందని నోకియా తెలిపింది. ఈ ఫోన్ లో టైపింగ్ మరియు కాలింగ్ కోసం తగిన పెద్ద కీప్యాడ్, వైర్ లెస్ FM మరియు మరింత సమర్ధవంతమైన ఆడియో మరియు మరింత సౌకర్యవంతమైన డిజైన్ తో ఈ ఫోన్ ను అందించినట్లు నోకియా తెలిపింది.
అయితే, ఏ ఫోన్ ఇంకా నోకియా స్టోర్ (వెబ్సైట్) నుండి లిస్టింగ్ చేయబడలేదు.