Nokia C12: నోకియా నుండి మరొక ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ వచ్చింది.!

Nokia C12: నోకియా నుండి మరొక ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ వచ్చింది.!
HIGHLIGHTS

నోకియా నుండి మరొక ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ వచ్చింది

Android 12 (Go edition) వంటి ఫీచర్లతో యూరప్ మార్కెట్ లో నోకియా లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఫీచర్లను కూడా అదే విదంగా కలిగి వుంటుంది

HMD గ్లోబల్ యాజమాన్యంలోని నోకియా నుండి మరొక ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆకర్షణీయమైన డిజైన్,  సింగల్ రియర్ కెమేరా మరియు Android 12 (Go edition) వంటి ఫీచర్లతో యూరప్ మార్కెట్ లో నోకియా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఫీచర్లను కూడా అదే విదంగా కలిగి వుంటుంది. ఈ లేటెస్ట్ నోకియా స్మార్ట్ ఫోన్ ఎటువంటి ప్రత్యేకతలను కలిగి ఉన్నదో చూద్దామా. 

Nokia C12: స్పెక్స్ 

నోకియా సి12 స్మార్ట్ ఫోన్ 6.3 ఇంచ్ డిస్ప్లేని HD+ రిజల్యూషన్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది మరియు ఇందులో  5MP సెల్ఫీ కెమేరాతో ఉంటుంది. ఈ ఫోన్ Unisoc SC9863A ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. జతగా 2GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. Nokia C12 స్మార్ట్ ఫోన్  Android 12 (Go edition) OS పైన పనిచేస్తుంది. 

ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 8MP సింగిల్ కెమేరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ 3,000mAh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇక ఇతర ఫీచర్ల పరంగా, 4G VoLTE, Wi Fi, బ్లూటూత్ 5.2, 3.5 mm ఆడియో జాక్ ను కలిగివుంది. 

Nokia C12: ధర 

Nokia C12: స్మార్ట్ ఫోన్ EUR 119 ప్రైస్ ట్యాగ్ తో యూరప్ మార్కెట్ లో లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ త్వరలోనే ఇతర మార్కెట్ లలో కూడా పరిచయం చేయబడవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo