హాట్ కేకుల్లా అమ్ముడైన Nokia G60 5G స్మార్ట్ ఫోన్స్.!

హాట్ కేకుల్లా అమ్ముడైన Nokia G60 5G స్మార్ట్ ఫోన్స్.!
HIGHLIGHTS

Nokia G60 5G ఈరోజు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వచ్చింది

హాట్ కేకుల్లా అమ్ముడైన Nokia G60 5G స్మార్ట్ ఫోన్స్

నోకియా అధికారిక వెబ్సైట్ లో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు ను పెట్టేసింది

హాట్ కేకుల్లా అమ్ముడైన Nokia G60 5G స్మార్ట్ ఫోన్స్. HMD Global యాజమాన్యం లోని నోకియా ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 8వ తేదీ, అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన సేల్ నుండి ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే, సేల్ మొదలైన కొన్ని గంటల్లోనే ఈ ఫోన్ స్టాక్స్ పూర్తిగా అయిపోయినట్లు నోకియా అధికారిక వెబ్సైట్ లో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు ను పెట్టేసింది. అంటే, ఈ ఫోన్ యొక్క అన్ని యూనిట్లు పూర్తిగా అమ్ముడైనట్లు మనం అర్ధం చేసుకోవచ్చు.

అయితే, నోకియా జి60 5జి స్మార్ట్ ఫోన్ యొక్క ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయి మరియు ఈ ఫోన్ ఎప్పుడు స్టాక్ లోకి వస్తుందనే విషయాలను నోకియా అధికారికంగా వెల్లడించలేదు.

Nokia G60 5G: ధర

Nokia G60 5G స్మార్ట్ ఫోన్ ను రూ.29,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్లాక్ మరియు ఐస్ రెండు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ Nokia.com ద్వారా విక్రయించబడుతుంది.

Nokia G60 5G: స్పెక్స్ మరియు ఫీచర్లు

నోకియా జి 60 5జి స్మార్ట్‌ ఫోన్ Snapdragon 695 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్‌ శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ కి జతగా 6 జీబీ ర్యామ్ మరియు 128 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. Nokia G60 5G పెద్ద 6.58 -అంగుళాల FHD+ స్క్రీన్‌ తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే 12Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ డిస్ప్లే రక్షణ కోసం పైన గొరిల్లా గ్లాస్ 5 ని కంపెనీ అందించింది. ఈ డిస్ప్లే మరియు ఫోన్ కు పవర్ ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5000 mAh బ్యాటరీని 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వబడింది.

నోకియా జి 60 5జి లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వుంది. ఈ స్మార్ట్ ఫోన్  f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది AI Portrait, డార్క్ విజన్, నైట్ సెల్ఫీ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ బెడదా లేని Android 12 OS పైన నడుస్తుంది మరియు 3 మేజర్ అప్డేట్స్ ను అందుకుంటుందని కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo