Nokia G60 5G: ఇండియాలో విడుదలకు సిధ్దమైన నోకియా 5G ఫోన్.!

Updated on 30-Oct-2022
HIGHLIGHTS

నోకియా ఇండియాలో సరికొత్త 5G ఫోన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది

Nokia G60 5G పేరుతో తీసుకొస్తున్న కంపెనీ

ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ కి అందుబాటులోకి వస్తుందని నోకియా ప్రకటించింది

HMD గ్లోబల్ నేతృత్వంలోని నోకియా ఇండియాలో సరికొత్త 5G ఫోన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. Nokia G60 5G పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ నోకియా ఫోన్లలో ఇప్పటి వరకూ లేని విధంగా 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, స్టన్నింగ్ డిజైన్ మరియు ఇంప్రూవ్డ్ AI కెమెరా ఫీచర్లతో వస్తోంది. నోకియా జి60 5జి ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లను కంపెనీ ప్రకటించిన ధర వివరాలను వెల్లడించలేదు. అయితే, త్వరలోనే ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ కి అందుబాటులోకి వస్తుందని నోకియా ప్రకటించింది.

Nokia G60 5G: స్పెక్స్ మరియు ఫీచర్లు

నోకియా జి 60 5జి స్మార్ట్‌ ఫోన్ Snapdragon 695 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్‌ శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ కి జతగా 6 జీబీ ర్యామ్ మరియు 128 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. Nokia G60 5G పెద్ద 6.58 -అంగుళాల FHD+ స్క్రీన్‌ తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే 12Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ డిస్ప్లే రక్షణ కోసం పైన గొరిల్లా గ్లాస్ 5 ని కంపెనీ అందించింది. ఈ డిస్ప్లే మరియు ఫోన్ కు పవర్ ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5000 mAh బ్యాటరీని 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వబడింది.

నోకియా జి 60 5జి లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వుంది. ఈ స్మార్ట్ ఫోన్  f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది AI Portrait, డార్క్ విజన్, నైట్ సెల్ఫీ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ బెడదా లేని Android 12 OS పైన నడుస్తుంది మరియు 3 మేజర్ అప్డేట్స్ ను అందుకుంటుందని కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :