నోకియా లేటెస్ట్ బడ్జెట్ Nokia G42 5G స్మార్ట్ ఫోన్ యొక్క కొత్త వేరియంట్ ను HMD Global ఈరోజు లాంఛ్ చేసింది. HMD నోకియా ఇండియాలో చాలా చవక ధరలో విడుదల చేసిన ఈ కొత్త వేరియంట్ ను అమేజాన్ స్పెషల్ గా తీసుకు వచ్చింది. భారత్ మార్కెట్ లో ఇప్పటికే అండర్ 10K బడ్జెట్ లో అధికమైన కాంపిటేషన్ కొనసాగుతోంది. ఇప్పుడు నోకియా తీసుకు వచ్చిన నోకియా G42 5జి కొత్త వేరియంట్ తో ఈ సెగ్మెంట్ లో మరింత సెగపుడుతుంది.
నోకియా జి42 5జి కొత్త వేరియంట్ ను కేవలం రూ. 9,999 రూపాయల ధరలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Amazon Specials మరియు HMD.com నుండి March 8 వ తేది నుండి సేల్ అవుతుంది. నోకియా జి42 5జి స్మార్ట్ ఫోన్ ముందుగా రూ. 12,999 రూపాయల స్టార్టింగ్ ధరలో లభిస్తుండగా, ఇప్పుడు అందించిన కొత్త వేరియంట్ తో ఈ ఫోన్ ధర రూ. 9,999 నుండి ప్రారంభమవుతుంది.
Also Read: POCO M6 Pro 5G ఫోన్ పైన భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
నోకియా జి42 5జి స్మార్ట్ ఫోన్ Snapdragon 480+ 5G ఆక్టా కొర్ ప్రోసెసర్ శక్తితో నడుస్తుంది. కొత్త వేరియంట్ లో 4GB RAM + 2GB Virtual RAM ఫీచర్ ను అందించింది. ఈ ఫోన్ లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ కలిగిన 6.56 ఇంచ్ HD+ డిస్ప్లేని 90 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది.
50MP AF Triple AI Camera కెమేరా సిస్టం మరియు ముందు సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ కెమేరాతో OZO 3D Audio recording ఫీచర్ కూడా ఉంటుంది. ఈ నోకియా స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 20W fast ఛార్జ్ (QC3.0 & PD3.0) సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్
Android 13 OS పైన రన్ అవుతుంది మరియు 2 OS అప్గ్రేడ్ లకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ కొత్త వేరియంట్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ముందుగా కేవలం 6GB మరియు 8GB RAM వేరియంట్ లలో మాత్రమే లభిస్తున్న ఈ ఫోన్ కోసం ఇప్పుడు 4GB + 128GB వేరియంట్ ను అదే స్పెక్స్ తో అందించింది.