రూ. 9,999 ధరకే Nokia G42 5G స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ లాంఛ్.!

రూ. 9,999 ధరకే Nokia G42 5G స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ లాంఛ్.!
HIGHLIGHTS

Nokia G42 5G స్మార్ట్ ఫోన్ యొక్క కొత్త వేరియంట్ ను HMD Global ఈరోజు లాంఛ్ చేసింది

ఈ కొత్త వేరియంట్ ను అమేజాన్ స్పెషల్ గా తీసుకు వచ్చింది

కొత్త వేరియంట్ లో 4GB RAM + 2GB Virtual RAM ఫీచర్ ను అందించింది

నోకియా లేటెస్ట్ బడ్జెట్ Nokia G42 5G స్మార్ట్ ఫోన్ యొక్క కొత్త వేరియంట్ ను HMD Global ఈరోజు లాంఛ్ చేసింది. HMD నోకియా ఇండియాలో చాలా చవక ధరలో విడుదల చేసిన ఈ కొత్త వేరియంట్ ను అమేజాన్ స్పెషల్ గా తీసుకు వచ్చింది. భారత్ మార్కెట్ లో ఇప్పటికే అండర్ 10K బడ్జెట్ లో అధికమైన కాంపిటేషన్ కొనసాగుతోంది. ఇప్పుడు నోకియా తీసుకు వచ్చిన నోకియా G42 5జి కొత్త వేరియంట్ తో ఈ సెగ్మెంట్ లో మరింత సెగపుడుతుంది.

Nokia G42 5G New Variant price

నోకియా జి42 5జి కొత్త వేరియంట్ ను కేవలం రూ. 9,999 రూపాయల ధరలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Amazon Specials మరియు HMD.com నుండి March 8 వ తేది నుండి సేల్ అవుతుంది. నోకియా జి42 5జి స్మార్ట్ ఫోన్ ముందుగా రూ. 12,999 రూపాయల స్టార్టింగ్ ధరలో లభిస్తుండగా, ఇప్పుడు అందించిన కొత్త వేరియంట్ తో ఈ ఫోన్ ధర రూ. 9,999 నుండి ప్రారంభమవుతుంది.

Also Read: POCO M6 Pro 5G ఫోన్ పైన భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

Nokia G42 5G Specs

నోకియా జి42 5జి స్మార్ట్ ఫోన్ Snapdragon 480+ 5G ఆక్టా కొర్ ప్రోసెసర్ శక్తితో నడుస్తుంది. కొత్త వేరియంట్ లో 4GB RAM + 2GB Virtual RAM ఫీచర్ ను అందించింది. ఈ ఫోన్ లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ కలిగిన 6.56 ఇంచ్ HD+ డిస్ప్లేని 90 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది.

50MP AF Triple AI Camera కెమేరా సిస్టం మరియు ముందు సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ కెమేరాతో OZO 3D Audio recording ఫీచర్ కూడా ఉంటుంది. ఈ నోకియా స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 20W fast ఛార్జ్ (QC3.0 & PD3.0) సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్
Android 13 OS పైన రన్ అవుతుంది మరియు 2 OS అప్గ్రేడ్ లకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ కొత్త వేరియంట్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ముందుగా కేవలం 6GB మరియు 8GB RAM వేరియంట్ లలో మాత్రమే లభిస్తున్న ఈ ఫోన్ కోసం ఇప్పుడు 4GB + 128GB వేరియంట్ ను అదే స్పెక్స్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo