HMD Global నోకియా లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ Nokia G42 5G యొక్క సరసమైన వేరియంట్ ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. గత సంవత్సరం ఇండియన్ మార్కెట్ లో నోకియా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సరసమైన వేరియంట్ ను నోకియా రీసెంట్ గా ప్రకటించింది. నోకియా జి 42 5జి కొత్త వేరియంట్ ను కేవలం రూ. 9,999 ప్రైస్ ట్యాగ్ తో తీసుకు వచ్చింది.
నోకియా జి 42 5జి కొత్త వేరియంట్ ను కంపెనీ విడుదల చేసిన తరువాత ఇప్పుడు ఈ ఫోన్ మూడు వేరియంట్ లలో లభిస్తోంది. ఈ మూడు వేరియంట్స్ ధరలను క్రింద చూడవచ్చు.
నోకియా జి 42 5జి కొత్త వేరియంట్ (4GB + 128GB) ధర: రూ. 9,999
నోకియా జి 42 5జి (6GB + 128GB) ధర: రూ. 12,499
నోకియా జి 42 5జి (8GB + 256GB) ధర: రూ. 16,999
పైన తెలిపిన కొత్త వేరియంట్ ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది మరియు మిగిలిన రెండు వేరియంట్స్ ముందు నుండే సేల్ అవుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ అమేజాన్ మరియు HMD.com నుండి లభిస్తున్నాయి.
Also Read: Xiaomi 14 Ultra: పవర్ ఫుల్ ఆల్రౌండ్ ఫీచర్స్ తో విడుదలయ్యింది.!
నోకియా జి42 5జి స్మార్ట్ ఫోన్ 10 వేల రూపాయల ప్రారంభ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ ని కలిగి వుంది. ఈ నోకియా స్మార్ట్ ఫోన్ లో 90Hz రెఫరీస్ రేట్ కలిగిన 6.56 ఇంచ్ HD డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో గట్టి ఉంటుంది. ఇందులో వెనుక 50MP ట్రిపుల్ రియర్ కెమేరా మరియు ముందు సెల్ఫీ కెమేరా ఉన్నాయి.
ఈ ఫోన్ Snapdragon 480 + 5G ప్రోసెసర్ మరియు 4GB / 6GB / 8GB RAM తో పాటుగా 128GB / 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అల్ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 20W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.
ఈ ఫోన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, కొత్త వేరియంట్ తో 10 వేల బడ్జెట్ లో ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఫీచర్లు కలిగిన ఫోన్ లలో ఒకటిగా ఈ ఫోన్ గురించి చెప్పవచ్చు.