గతకొన్ని రోజులుగా నోకియా టెస్జింగ్ చేస్తున్న Nokia 5G Smartphone Launch డేట్ తో పాటు రెండర్స్ ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. నోకియా ఈ అప్ కమింగ్ ఫోన్ ను Nokia G42 5G పేరుతో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. నిన్నటి వరకూ ఈ Nokia Upcoming 5G Phone పేరు ప్రకటించని నోకియా ఇప్పుడు పేరుతో పాటుగా వివరాలను కూడా తెలిపింది. Nokia New Phone గురించి కంపెనీ టీజర్ చాలా వివరాలను మరియు కీలకమైన స్పెక్స్ ను వెల్లడించింది. Nokia G42 5G స్మార్ట్ ఫోన్ వివరాల పైన ఒక లుక్కేద్దామా.
Nokia అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Nokia G42 5G ను సెప్టెంబర్ 11వ తేదీన ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఫోన్ కీలకమైన వివరాలను కంపెనీ ముందుగానే వెల్లడించింది మరియు రేటును సెప్టెంబర్ 11న ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ ను Amazon Special గా తీసుకు వస్తోంది మరియు అమేజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది.
Also Read: అక్టోబర్ 1 నుండి అమలులోకి New SIM Card Rules .. ఫాలో అవ్వక పొతే 10 లక్షల Fine.!
Nokia G42 5G స్మార్ట్ ఫోన్ ను 6.53 ఇంచ్ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లేతో లాంచ్ చేస్తోంది. ఈ డిస్ప్లే OZO Play Back తో మంచి విజువల్స్ మరియు సౌండ్ ను అందిస్తుంది. ఈ డిస్ప్లేని వాటర్ డ్రాప్ సెల్ఫీ కెమేరా డిజైన్ తో కలిగి వుంది. Nokia G42 5G స్మార్ట్ ఫోన్ ను విలక్షణమైన ప్రీమియం లుక్ కలర్ డిజైన్ తో తో లాంచ్ చేస్తున్నట్లు టీజర్ లో తెలిపింది.
Nokia G42 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 480+ 5G ఫాస్ట్ ప్రోసెసర్ కి జతగా 11GB వరకూ RAM సపోర్ట్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు Nokia గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ అందించిన కెమేరా సెటప్ గురించి కూడా నోకియా అనౌన్స్ చేసింది. Nokia G42 5G ఫోన్ 50MP AI Triple Camera తో వస్తోంది మరోయు ముందు 8MP సెల్ఫీ కెమేరా కూడా ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.
Nokia G42 5G స్మార్ట్ ఫోన్ 3 Years సెక్యూరిటీ అప్డేట్స్ ను అందిస్తుందని 2 మేజర్ Android OS Upgrade లను కూడా అందిస్తుందని నోకియా తెలిపింది.
నోకియా ఈ అప్ కమింగ్ ఫోన్ Nokia G42 5G Price ను భారతీయ యూజర్ల ను దృషిలో పెట్టుకొని తీసుకు వస్తే మాత్రం మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న చాలా ఫోన్లకు గట్టి పోటీగా నిలుస్తుంది.