Nokia G42 5g launched: భారీ ఫీచర్లతో రూ.12,599 రూపాయలకే 5G ఫోన్ లాంచ్.!
Nokia G 42 5G ఫోన్ ను తక్కువ ధరలో లాంచ్ చేసిన నోకియా
Nokia G42 5G స్మార్ట్ ఫోన్ రూ. 12,599ప్రారంభ ధరతో లాంచ్
Nokia G42 5G స్మార్ట్ ఫోన్ నోకియా నుండి వచ్చిన చవకైన 5G Smartphone గా నిలుస్తుంది
HMD Global ఆద్వర్యంలోని Nokia Brand ఇప్పటి వరకూ స్మార్ట్ ఫోన్ లను మంచి Premium Price సెగ్మెంట్ లో అందించింది. అయితే, ఇప్పుడు ఇండియాలో తన కొత్త 5G Smartphone ను అతి అతి తక్కువ ధరకే లాంచ్ చేసిన అందరిని ఆశ్చర్యపరిచింది. ఈరోజు Nokia G42 5G స్మార్ట్ price ను ప్రకటించింది. Nokia G42 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 12,599 లాంచ్ అఫర్ ధరతో ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంట తక్కువ ధరలో వచ్చిన ఈ ఫోన్ ఫీచర్లను మాత్రం భారీగానే అందించింది.
Nokia G42 5G Price
చాలా కాలంగా నొక్కి ఊరిస్తున్న Nokia G42 5G Price ను ఈరోజు నోకియా అనౌన్స్ చేసింది. Nokia G42 5G స్మార్ట్ ఫోన్ రూ. 12,599ప్రారంభ ధరతో లాంచ్ అఫర్ ధరలో భాగంగా లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ యొక్క సెప్టెంబర్ 15 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్ స్పెషల్ గా సేల్ అవుతుంది.
Are you ready to #MoveFast with the incredible Nokia G42 5G! Powered by Snapdragon 480+ 5G, 11GB RAM, 50MP triple rear AI camera, 3-day battery life… all this, and so much more…
Launching at just ₹12,599. Sale starts on 15th September, 12PM on Amazon Specials.
Click here… pic.twitter.com/rqhbVSKQex
— Nokia Mobile India (@NokiamobileIN) September 11, 2023
Nokia G42 5G Specs
Nokia G42 5G స్మార్ట్ ఫోన్ నోకియా నుండి వచ్చిన చవకైన 5G Smartphone గా నిలుస్తుంది. ఈ nokia 5g phone మీడియం 6.56 ఇంచ్ HD+ డిస్ప్లేని OZO Playback సపోర్ట్ తో కలిగి వుంది. అంటే, ఈ ఫోన్ లీనమయ్యే వీడియో మరియు ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. ఈ నోకియా ఫోన్ Snapdragon 480+ 5G ప్రోసెసర్ తో వచ్చింది. దీనికి జతగా వున్న 6GB + 5GB వర్చువల్ RAM సపోర్ట్ తో 11GB వరకూ ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. అయితే, ఇందులో 4GB RAM వేరియంట్ 2GB వర్చువల్ ర్యం సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటుంది.
నోకియా జి42 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక OZO 3D Audio recording సపోర్ట్ కలిగిన కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో వెనుక 50 MP మెయిన్ (AF) కెమేరా + 2 MP Depth సెకండరీ కెమేరా + 2 MP Macro సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమేరా వుంది మరియు ముందు సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ నోకియా ఫోన్ 5000 mAh బ్యాటరీని 20W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.