HMD Global యాజమాన్యం లోని Nokia కంపెనీ ఇండియన్ మార్కెట్ లో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో మన్నికైన స్మార్ట్ ఫోన్ కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకొని ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. అదే, నోకియా సి22 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ అతి తక్కువ ధరలో డ్యూయల్ రియర్ కెమేరాతో వచ్చిన నొక్కియా సార్ట్ ఫోన్ గా నిలుస్తుంది.
నోకియా ఈ నోకియా సి22 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (2GB+64GB) ను కేవలం రూ. 7,999 రేటుతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ. 8,499 ధరతో వచ్చింది మరియు ఇది కూడా 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది.
నోకియా ఈ ఫోన్ తో జియో అఫర్ ను కూడా జత చేసింది. నోకియా సి22 స్మార్ట్ ఫోన్ తో జియో యూజర్లు 3,500 వరకూ అదనపు ప్రయోజనాలను పొందవచ్చని నోకియా తెలిపింది.
నోకియా సి22 స్మార్ట్ ఫోన్ బిగ్ అండ్ లాంగ్ HD డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ 20:9 ఆస్పెక్ట్ రేషియో మరియు 720×1600 రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ నోకియా స్మార్ స్మార్ట్ ఫోన్ Unisoc SC9863A ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ Android 13 OS (గో ఎడిషన్) తో వస్తుంది మరియు క్వార్ట్రర్లి సెక్యూరిటీ అప్డేట్ ను అందుకుంటుంది. అయితే, ఈ ఫోన్ తో ఎటువంటి మేజర్ అప్డేట్ అందవని కంపెనీ తెలిపింది.
ఈ స్మార్ట్ ఫోన్ వెనుక 13ప్రైమరీ మరియు 2MP కెమేరా కలిగిన డ్యూయల్ కెమేరా సెటప్ వుంది. నోకియా సి 22 స్మార్ట్ ఫోన్ లో 8ఎంపీ సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ లో అందించిన బ్యాటరీ వివరాలను తెలియ చెయ్యలేదు కానీ, 10W ఛార్జింగ్ సపోర్ట్ ఉందని మాత్రం తెలిపింది. ఈ ఫోన్ మంచి లుక్స్ మరియు గట్టి బిల్డ్ క్వాలిటీ తో కనిపిస్తోంది.