D1C పేరుతో నోకియా నుండి స్మార్ట్ ఫోన్ వస్తుంది. మరోవైపు ఫ్లాగ్ షిప్ రేంజ్ లో హై ఎండ్ ఫోనులు వస్తున్నాయి అని రిపోర్ట్స్ ఉండగా, D1C బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని తెలుస్తుంది..
ఈ మోడల్ రామ్, కెమెరా అండ్ డిస్ప్లే సైజ్ మార్పులతో రెండు వేరియంట్స్ లో వస్తుంది అని లేటెస్ట్ లీక్స్ చెబుతున్నాయి. నోకియా పవర్ యూసర్ సైట్ నుండి ఈ వివరాలు రిపోర్ట్ అయ్యాయి.
కొన్ని స్పెక్స్ కూడా తెలిపింది సైట్. సో 2GB రామ్, 5 in FHD డిస్ప్లే, 13MP రేర్ కెమెరా తో మొదటి వేరియంట్ ఉండగా, ఎక్కువ ప్రైస్ వేరియంట్ లో 5.5 in 1080P డిస్ప్లే, 3GB రామ్, 16MP రేర్ కెమెరా ఉంటాయి.
రెండింటిలో స్నాప్ డ్రాగన్ 430 ప్రొసెసర్, గ్రాఫిక్స్ కొరకు Adreno 505 GPU, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 8MP ఫ్రంట్ కెమెరా ఉంటాయి అని రిపోర్ట్.
ఆండ్రాయిడ్ లేటెస్ట్ OS వెర్షన్ ఆండ్రాయిడ్ N 7.0 తో కంపెని సొంతంగా యూజర్ ఇంటర్ఫేస్ ఇస్తుంది అని అంచనా కలిగిన ఈ నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ ప్రతీ సంవత్సరం జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో 2017 లో రిలీజ్ అవుతుంది అని రిపోర్ట్స్.