9,999 రూ లకు నోకియా అప్ కమింగ్ ఆండ్రాయిడ్ ఫోన్: డిటేల్స్ క్రింద
నోకియా D1C ఫోన్ గురించి ఇప్పటివరకూ చాలా రిపోర్ట్స్ వినిపించాయి. లేటెస్ట్ గా నోకియా పవర్ యూసర్ రిపోర్ట్స్ ప్రకారం D1C మోడల్ ప్రైస్ 9,999 రూ నుండి మొదలవుతుంది.
HMD Global తయారు చేస్తున్న నోకియా ఫోనులు క్వాలిటీ వైజ్ గా ఎక్కడా compromise అవ్వకుండా బడ్జెట్ ప్రైసింగ్ లో ఉండేలా ప్లాన్ చేస్తుంది.
ఇదే కన్ఫర్మ్ అయితే, Xiaomi, లెనోవో, ఆసుస్ వంటి ఇతర బడ్జెట్ కంపెనీలకు పెద్ద పోటీ రానుంది అని చెప్పాలి. నోకియా D1C రెండు వేరియంట్స్ లో రానుంది అని అంచనా…
ఒకటి 2GB రామ్ వెర్షన్, మరొకటి 3GB రామ్ వెర్షన్. మొదటిది 9,999 రూ ఉండగా, రెండవది సుమారు 12,999 రూ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ Nougat 7.0 OS తో వస్తుంది అని కూడా రిపోర్ట్స్.
ఎప్పుడు రిలీజ్ అయ్యే chances ఉన్నాయి?
2017, బార్సిలోనా లో జరిగే Mobile World Congress లో ఫోన్ గ్లోబల్ గా అనౌన్స్ అవుతుంది. ఈ ఈవెంట్ మొదటి మూడు నెలలలో జరుగుతుంది.
ఇతర స్పెక్స్ పై ఉన్న రూమర్స్ విషయానికి వస్తే ఫోన్ లో 5 in FHD డిస్ప్లే, 3GB రామ్, 2GB రామ్, 13MP రేర్ 8MP ఫ్రంట్ కేమేరాస్ ఉండనున్నాయి అని రిపోర్ట్స్.
మరొక వేరియంట్ లో 5.5 in FHD డిస్ప్లే, 3GB రామ్, 16MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా ఉండనున్నాయి అని రిపోర్ట్స్. ఈ D1C బడ్జెట్ మోడల్ తో పాటు ఫ్లాగ్ షిప్(highend) రేంజ్ స్మార్ట్ ఫోన్ కూడా విడుదల అవుతుంది అని అంచనా.