Nokia D1C స్మార్ట్ ఫోన్ అంటూ చైనీస్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ Weibo లో కొత్త ఇమేజెస్ లీక్ అయ్యాయి. నోకియా ఆల్రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తయారీ చేస్తున్నట్లు మీకు తెలిసినదే..
లీక్ అయిన ఇమేజ్ ప్రకారం ఫోన్ మెటల్ ఫ్రేమింగ్ తో మరియు వెనుక matte ఫినిషింగ్ తో వస్తుంది. అలాగే ఫోన్ వెనుక కెమెరా module మరియు LED ఫ్లాష్ ఉన్నట్లు తెలుస్తుంది.
ఇది మూడు కలర్స్ – గోల్డ్, బ్లాక్ అండ్ సిల్వర్ వైట్ లో కనిపిస్తుంది. గోల్డ్ కలర్ వేరియంట్ కు ఫ్రంట్ లో హోం బటన్ కూడా ఉంది. సో ఫోన్ రెండు మూడు వేరియంట్స్ లో రిలీజ్ అవుతుంది అని అంచనా.
స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ AnTuTu లిస్టింగ్ ప్రకారం నోకియ D1 C లో ఫుల్ HD డిస్ప్లే, ఆండ్రాయిడ్ 7.0 N OS, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 430 SoC, 3GB రామ్..
32GB ఇంబిల్ట్ స్టోరేజ్, మైక్రో SD కార్డ్ సపోర్ట్, 13MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి ఈ ఫోన్ లో. అయితే ఇవ్వన్నీ కేవలం లీక్ అయిన లిస్టింగ్ ద్వారా తెలిసినవే.
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016 లో నోకియా తన participation confirm చేయటంతో నోకియ ఆండ్రాయిడ్ ఫోన్ ఫెబ్రవరి 2017 లో రిలీజ్ అవుతుంది అని అంచనా.