డిసెంబర్ 5 న జరగనున్నకార్యక్రమంలో 3 కొత్త ఫోన్లను విడుదల చేయనున్న నోకియా

Updated on 16-Nov-2018
HIGHLIGHTS

HMD గ్లోబల్, నోచ్ డిస్ప్లే కలిగిన రేడు కొత్త ఫోనులు మరియు ఒక స్టాండర్డ్ డిస్ప్లే తో కలిపి మూడు ఫోన్లను కలిగిన్నపోస్టరుతో టీజింగు చేస్తోంది.

HMD గ్లోబల్ డిసెంబరు 5 న దుబాయిలో ఒక కార్యక్రమాన్ని చేపట్టనుంది మరియు కంపెనీ యొక్క చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ అయినా Juho Sarvikas ఈ కార్యక్రమం  కోసం తేదీని ఆదా చేస్తున్నట్లు ట్వీట్ చేసారు. ఈ రాబోయే కార్యక్రమంలో నోకియా మూడు కొత్త ఫోన్లను ఆవిష్కరించవచ్చు, అనేవిషయాన్ని టీజర్ చిత్రం ద్వారా సూచన ప్రాయంగా  తెలుస్తోంది. ఈ టీజర్ కొంచెం చీకటిగా ఉంటుంది మరియు ఇది ఎటువంటి ఫోన్లను తీసుకురానున్నదో  తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది.  అయినప్పటికీ, ఈ చిత్రాన్ని బ్రైట్ చేసినపుడు, ఇందులో మూడు ఫోన్లలో కనీసం రెండు వాటి డిస్ప్లేల పైన ఒక నోచ్ ని కలిగి ఉన్నట్లు గమనించవచ్చు. కుడివైపున ఉన్న హ్యాండ్సెట్లో నోచ్ కనపడదు మరియు నోకియా యొక్క గ్లోబల్ వేరియంట్ అయిన, నోకియా X7 లేదా నోకియా 8.1 ను ఆవిష్కరించగలదని కొన్ని పుకార్లు సూచిస్తున్నాయి. అలాగే, నోకియా 2.1 కూడా కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు, కానీ మూడు ఫోన్లు నోచ్ కలిగినవి కూడా కావచ్చు.

ఈ నోచ్ లేని పరికరం నోకియా 9 కావచ్చు, ఇది ఒక సాంప్రదాయిక 18: 9 డిస్ప్లే తో  పైన నోచ్  లేకుండా వస్తున్నట్లు పుకారు. ఈ ఫోన్ యొక్క CAD- ఆధారిత రెండర్లు ముందుగా లీక్ చేసారు, గుండ్రని అంచులు మరియు సంప్రదాయ డిస్ప్లేను సూచిస్తున్నాయి.  ఫోన్లు ప్రారంభించే ప్రధాన సమయం అక్టోబర్ నాటికి షాపింగ్ సీజన్ సమయం ముగిసిన తరువాత, దీనిని  నోకియా సంవత్సరం చివరలో ఏ కొత్త ఫ్లాగ్షిప్ని ప్రారంభించకపోవచ్చు స్థానిక మార్కెట్ కోసం. ఎప్పటిలాగే,  ప్రస్తుతం అనుకునే ప్రతిదీ కూడా ఒక ఊహాగానం మాత్రమే అవుతుంది.  ఎందుకంటే, పూర్తి సమాచారం అందేవరకు మనం వేచిచూడవలిసిందే.

నోకియా అనేక ప్రత్యేకమైన ఫోన్లను చైనా ఎక్స్క్లూజివ్స్ గా విడుదల చేసింది, తరువాత వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించింది. ఈ విధంగా చూస్తే, గత నెలలో చైనాలో విడుదలైన నోకియా X7 యొక్క ప్రారంభం కూడా ఇక్కడ జరగవచ్చు.  సంప్రదాయ నోకియా 7.1 ప్లస్ పేరుకు బదులుగా, నోకియా 8.1 ప్లస్ పేరు మార్చబడింది, ఎందుకంటే అదే పేరుతో ఒక పరికరం Geekbench లో గుర్తించబడింది మరియు Snapdragon 710 SoC తో 4GB RAM తో పనిచేయడం చూపించబడింది. ఇవి నోకియా 7.1 ప్లస్ లాంటివి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :