నోకియా యొక్క లేటెస్ట్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ Nokai C12 చాలా తక్కువ ధరతో ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ నోకియా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చినా కూడా ఆకర్షణీయమైన డిజైన్ మరియు Android 12 (Go edition) వంటి బెస్ట్ ఫీచర్లతోఆకట్టుకుంటుంది. అయితే, ప్రస్తుతం మార్కెట్ లో 6,000 బడ్జెట్ సెగ్మెంట్ ఉన్న ఇతర ఫోన్లకు గట్టి పోటీని ఇచ్చే లక్ష్యంతో ఈ ఫోన్ చాలా తక్కువ ధరలో విడుదల చేసినట్లు మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లను ఇక్కడ చూడవచ్చు.
Nokia C12 స్మార్ట్ ఫోన్ ను 2GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో నోకియా లాంచ్ చేసింది. ఈ ఫోన్ రేపటి నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
నోకియా సి12 స్మార్ట్ ఫోన్ 6.3 ఇంచ్ డిస్ప్లేని HD+ రిజల్యూషన్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది మరియు ఇందులో 5MP సెల్ఫీ కెమేరాతో ఉంటుంది. ఈ ఫోన్ Unisoc SC9863A ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. జతగా 2GB ర్యామ్ కి జతగా 2GB వర్చువల్ RAM మరియు 64GB స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. Nokia C12 స్మార్ట్ ఫోన్ Android 12 (Go edition) OS పైన పనిచేస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 8MP సింగిల్ కెమేరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ 3,000mAh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇక ఇతర ఫీచర్ల పరంగా, 4G VoLTE, Wi Fi, బ్లూటూత్ 5.2, 3.5 mm ఆడియో జాక్ ను కలిగివుంది.