Nokia Ozo అనే VR డివైజ్ ను అనౌన్స్ చేసింది.

Nokia Ozo అనే VR డివైజ్ ను అనౌన్స్ చేసింది.
HIGHLIGHTS

ఇది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ డివైజ్

గతంలో నోకియా VR కెమేరా పై పనిచేస్తుంది అని వార్తలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదు. నోకియా 2016 లో ఫోన్ మార్కెట్ లోకి తిరిగి ప్రవేసించే ముందు కొత్తగా ఎవరూ ఊహించని డివైజ్ లాంచ్ చేసింది.

దీని పేరు OZO. ఇది 360 యాంగిల్ లో వీడియోస్ ను తీసే కెమేరా. ఇది మూవీ మేకింగ్ మరియు ఇతర ఎంటర్టైన్మెంట్ field లో ఉపయోగించే డివైజ్. ధర కూడా expensive గా ఉండవచ్చు అని అంచనా. ఇది ad making మరియు media ఇండస్ట్రీ consumers కు అవసరం అయ్యే పరికరం అవటం వలనే కంపెని కూడా లాస్ ఏంజెల్స్ లో జరిగిన entertainment ఈవెంట్ లోనే లాంచ్ చేసింది Ozo ను.

Ozo VR వీడియోలను రియల్ టైమ్ లో షూట్ చేయటానికి ఉపయోగపడుతుంది. live monitoring, rapid playback కూడా దీనిలో ఉన్నాయి. సాధారణంగా VR వీడియో ను ప్లేబ్యాక్ చేయటానికి షూట్ చేసిన footage ను డిజిటల్ గా stiching చేసి చూడాలి. కాని దీనిలో Low రిసల్యుషణ్ రెండరింగ్ లో కొన్ని నిమిషాల్లోనే ప్లే అవుతుంది. 

దీని బరువు 2.7 Kg. 8 ఆప్టికల్ ఇమేజ్ సెన్సార్లు మరియు ఆడియో కోసం 8 మైక్రో ఫోన్స్ embedded అయ్యి ఉన్నాయి దీనిలో. చూడటానికి కొంచెం వింతగా ఉంది కాని లుక్స్ ఫీల్ బానే ఉంది. తాజగా మొబైల్ మార్కెట్ లో రీ ఎంట్రీ ఇవ్వటానికి ఫ్రెంచ్ కంపెని Alcatel ను acquire చేసుకుంది నోకియా.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo