అద్దెకు 5G ఫోన్: నోకియా కొత్త ఆలోచన అదిరిందిగా.!

Updated on 09-Nov-2022
HIGHLIGHTS

కొత్త ఆలోచనతో నోకియా సంస్థ ముందుకు వచ్చింది

నోకియా ప్రీమియం ఫోన్ ను అద్దెకు తీసుకొని వాడుకోవచ్చు

Nokia X30 5G ని అద్దెకు తీసుకొని ఉపయోగించవచ్చు

ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను కేవలం నామ మాత్రపు రుసుముతో అద్దెకు ఇవ్వాలనే కొత్త ఆలోచనతో నోకియా సంస్థ ముందుకు వచ్చింది. నానాటికి పెరుగుతున్న టెక్నాలజీతో మార్కెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్లు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. ఒకేసారి ఫోన్ కొంటే ఆ ఫోన్ చాలా కాలం ఉపయోగిస్తాము. అయితే, నోకియా తీసుకువస్తున్న ఈ కొత్త ఆలోచనతో ప్రీమియం ఫోన్ ను అద్దెకు తీసుకొని వాడుకోవచ్చు. అందుకే, నోకియా తన వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్ తో కంపెనీ యొక్క పర్యావరణ అనుకూల స్మార్ట్‌ ఫోన్ Nokia X30 5Gని అద్దెకు తీసుకొని ఉపయోగించవచ్చు. ఈ కొత్త ఆలోచన తాలూకు వివరాలేమిటో తెలుసుకుందామా.

వివరాల్లోకి వెళితే, $ 520 (సుమారు రూ.42,300) విలువైన Nokia X30 5G స్మార్ట్ ఫోన్ ను నెలకు $ 25 చెల్లించి, అంటే దాదాపు రూ. 2,033 చెల్లించి అద్దెకు తీసుకోవచ్చు. అయితే, ఈ రెంటల్ సర్వీస్ ను మీరు కనీసం మూడు నెలల పాటు ఉపయోగించాల్సి ఉంటుందని నోకియా చెబుతోంది. అంతేకాదు, ఈ సర్వీస్  సమయంలో ఫోన్ కోల్పోయిన లేదా పాడైన ఆ స్మార్ట్‌ ఫోన్‌ లను తిరిగి కంపెనీ భర్తీ చేస్తుంది, అని కూడా చెబుతోంది.

ప్రస్తుతానికి ఇతర దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ సర్వీస్ ను నోకియా త్వరలోనే భారతదేశంలో కూడా పరిచయం చేయబోతోంది. అంటే, అద్దెకు 5G ఫోన్ సర్వీస్ ను  భారతీయ వినియోగదారులకు కూడా అందిస్తుందని భావిస్తున్నారు. నోకియాకు చెందిన ఈ ఎకో ఫ్రెండ్లీ ఫోన్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం పదండి.

Nokia X30 5G: స్పెక్స్

నోకియా X30 5G స్మార్ట్ ఫోన్ 6.43-అంగుళాల FHD + డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. Nokia X30 5G స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రోసెసర్ కి జతగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ 5G ఫోన్ అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు Android 12 OS ఆపిన రాం అవుతుంది.

కెమెరా విభాగంలో, ఈ నోకియా 5G ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా జతగా 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా వుంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4200mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో వస్తుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :