Nokia x30 5G: నోకియా కొత్త 5G ఫోన్ పైన 12 వేల భారీ తగ్గింపు | New Price ఇదే

Nokia x30 5G: నోకియా కొత్త 5G ఫోన్ పైన 12 వేల భారీ తగ్గింపు | New Price ఇదే
HIGHLIGHTS

నోకియా కొత్త 5G ఫోన్ పైన 12 వేల భారీ తగ్గింపు అందుకుంది

Nokia X30 5G పైన ఇప్పుడు భారీ తగ్గింపు నోకియా అనౌన్స్ చేసింది

ఈ నోకియా కొత్త 5G ఫోన్ కొత్త ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు తెలుసుకోండి

Nokia x30 5G: నోకియా కొత్త 5G ఫోన్ పైన 12 వేల భారీ తగ్గింపు అందుకుంది. మార్కెట్ లో నడుస్తున్న 5G స్మార్ట్ ఫోన్ కాంపిటీషన్ దెబ్బకి అన్ని కంపెనీలు కూడా 15 వేల నుండి 25 వేల రూపాయల లోపలే తమ కొత్త 5G ఫోన్ లను లాంచ్ చేస్తున్నాయి. నోకియా కూడా ఇదే దారిలో తన లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ Nokia G42 5G ను కేవలం రూ. 12,599 రూపాయల ప్రారంభ ధరతో భారత్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కంటే ముందుగా విడుదల చేసిన 5G ఫోన్ Nokia X30 5G పైన ఇప్పుడు భారీ తగ్గింపును కూడా నోకియా అనౌన్స్ చేసింది. ఈ నోకియా కొత్త 5G ఫోన్ కొత్త ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు తెలుసుకోండి. 

Nokia x30 5G New price 

నోకియా x30 5G స్మార్ట్ ఫోన్ ను నోకియా రూ. 48,999 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ ఇప్పుడు నోకియా అధికారిక వెబ్సైట్ nokia.com మరియు Amazon నుండి కూడా రూ. 36,999 ధరతో లిస్ట్ చెయ్యబడింది. Amazon నుండి అఫర్ ధరతో కొనడానికి Click Here 

Nokia X30 5G specs

Nokia X30 5G స్మార్ట్ ఫోన్ 100% recycled aluminium తో వసుంది మరియు 65% recycled plastic తో కూడా వస్తుంది. అంటే, ఈ ఫోన్ నేచర్ కు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చేసే పూర్తి రీసైక్లబుల్  మెటీరియల్ తో వస్తుంది. ఈ ఫోన్ 6.43 ఇంచ్ 90Hz FHD+ AMOLED డిస్ప్లే, 50MP OIS డ్యూయల్ రియర్ కెమేరా, 8 GBRAM + 256 GB స్టోరేజ్, Snapdragon 695 5G ప్రోసెసర్, OZO Spatial Audio మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4200 mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి వుంది.

Is Nokia X30 5G water resistant?

అవును Nokia X30 5G IP67 రేటింగ్ తో పూర్తిగా వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Why is Nokia X30 so expensive?

ఈ ఫోన్ లాంచ్ సమయంలో రేటు చూసిన తరువాత ప్రతి ఒక్కరి మధిలో మెదిలిన తోలి ప్రశ్న ఇదే అంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. అయితే, Nokia X30 Review చేసిన Digit, ఈ ఫోన్ డిజైన్ పరంగా అద్భుతం అనిపించినా ఓవరాల్ గా 20 వేల రూపాయల సెగ్మెంట్ లో మార్కెట్ లో లభిస్తున్న 5G Smartphones కు పోటీ అవుతుందే తప్ప ప్రీమియం ప్రైస్ సెగ్మెంట్ లో తట్టుకొని నిలబడడం చాలా కష్టం అని తేల్చి చెప్పింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo