Nokia 9 ప్యూర్ వ్యూ కెమేరాతో 64MP ఫోటోలను షూట్ చేయవచ్చు: రిపోర్ట్
ఈ నివేదిక ప్రకారం మొత్తం ఐదు కెమేరాలను ఒకే సమయంలో పనిచేస్తాయి.
నోకియా 9 ప్యూర్ వ్యూ, బహుశా 2019 MWC లో ప్రారంభించటానికి అత్యంతగా ఎదురుచూస్తున్న ఫోన్లలో ఒకటి కావచ్చు.నోకియా యొక్క ఈ ప్రధాన ఫోన్ సంవత్సరం కంటే ఎక్కువ సమయం అభివృద్ధిలో ఉంది, మరియు అనేక నివేదికలు ఆధారంగా, ఇది బార్సిలో ఫిబ్రవరి 24 న మన ముందుకు రావడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఫోనులో, అందించిన కెమెరా సెటప్, చాల ప్రత్యేకంగా మరియు ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే, దీని డిస్ప్లేలో ఒక వేలిముద్ర సెన్సార్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ వంటి ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఆన్లైన్లో లీకైన కొన్ని ఫోటోలను పరిశీలిస్తే, ఈ నోకియా ఫోను గురించి నిర్దిష్ట సమాచారాన్ని పూర్తిగా వెల్లడికాకుండా జాగ్రత్తలు నిర్వహించేది. కానీ ఇప్పుడు, ఒక నోకియా పవర్ యూజర్ చేసిన ఒక నివేదిక, ఈ ఫోన్ యొక్క వివరాల గురించి చాలా వివరాలను వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం, నోకియా 9 ప్యూర్ వ్యూ లో ఉన్న పెంటా-లెన్స్ కెమెరా 64-మెగాపిక్సెల్ చిత్రాలను షూట్ చేయగలదు. ఇందులో ఒక 12-మెగాపిక్సెల్ సెన్సార్ల జత మరియు 16-మెగాపిక్సెల్ సెన్సార్స్ యొక్క మరొక జత ఉంటుంది. ఒక ఐదవ సెన్సార్ ఒక 8 మెగాపిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంది. అంతేకాక, నోకియా 9 ప్యూర్ వ్యూ Light Camera Technology వస్తాయి. ఈ లైట్ అనేది కంప్యూటింగ్ ఫోటోగ్రఫీలో నైపుణ్యం కలిగిన ఒక సంస్థ మరియు ఇది 2017 లో ప్రారంభించిన అప్రసిద్ధ 16-లెన్స్ కెమెరా వెనుక సంస్థగా ఉంది. ఈ నోకియా 9 ప్యూర్ వ్యూ, లాస్లెస్ జూమ్, 3D డెప్త్ మ్యాపింగ్ మరియు ఇటువంటి మరిన్ని అంశాలను తీసుకొచ్చేలా అనిపిసుంది.
అంతేకాకుండా, నోకియా 9 ప్యూర్ వ్యూ ఒకే సమయంలో ఈ ఐదు సెన్సార్ల ద్వారా చిత్రాలను షూట్ చేయగలదని ఈ నివేదిక వెల్లడిస్తుంది. అలా చేయడం వలన, ఇది తక్కువ-కాంతిలో మెరుగైన చిత్రాల కోసం మరింత కాంతిని సంగ్రహించవచ్చు.
నోకియా 9 ప్యూర్ వ్యూ, ఈ నెలలో విడుదలకానున్నట్లు ధ్రువీకరించబడింది. ఈ ఫోన్ ఇటీవల FCC ద్వారా ఆమోదించబడింది మరియు చైనాలో కూడా 3C బాడీ ఆమోదం పొందింది. గత నివేదికలు, ఈ ప్రధాన ఫోన్ HDR10 మద్దతుతో పాటు క్వాడ్ HD + రిజల్యూషన్ తో ఒక 5.99-అంగుళాల AMOLED డిస్ప్లేతో ఉంటుందని చెప్పారు. ఈ ఫోన్, హుడ్ కింద ఒక స్నాప్డ్రాగన్ 845 SoC తో ఉంటుంది. ఈ చిప్సెట్ 6GB RAM మరియు 128GB స్టోరేజి తో జత చేయబడుతుంది. 4GB RAM మరియు 128GB స్టోరేజితో పాటు ఒక సాధారణ వేరియంట్ కూడా ఉండవచ్చు.
అన్ని నోకియా ఫోన్ల మాదిరిగానే, ఇది కూడా Android One సర్టిఫికేట్ గా అందిస్తున్నదని భావిస్తున్నారు మరియు స్టాక్ Android 9 Pie తో అమలవుతుంది. చివరగా, ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ కోసం మద్దతునిచ్చే ఒక పెద్ద 4,150mAh బ్యాటరీని కలిగి ఉండటానికి ఉద్దేశించబడింది.