Nokia 8110 4G vs Jioఫోన్ : మరి మీకు నచ్చినది ఏది…

Updated on 27-Feb-2018

నోకియా 8110 కేవలం ఫీచర్ ఫోన్ మాత్రమే కాదు. ఇది కాల్ కోసం 4G VoLTE సపోర్ట్  మరియు Google అసిస్టెంట్, ఫేస్బుక్, గూగుల్ మ్యాప్స్, ట్విట్టర్ మరియు యాక్సెస్ తో దాని స్వంత యాప్  స్టోర్ తో వస్తుంది. 

అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు  'స్మార్ట్ ఫీచర్ ఫోన్'ను ఆశిస్తున్నారు , గత సంవత్సరం జియో ఫోన్ ఖచ్చితమైన ఫీచర్  సెట్ తో  వచ్చింది, తర్వాత గూగుల్ అసిస్టెంట్ కోసం కూడా మద్దతు లభించింది.

నోకియా 8110 4G  లాంచ్ అయింది కాబట్టి , JioPhone కి  గట్టి పోటీ ఇవ్వనుంది .నోకియా 8110 4G, 512MB RAM మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ తో 1.1 GHz డ్యూయల్ కోర్ క్వాల్కమ్ 205 మొబైల్ ప్రాసెసర్ కలిగి వుంది  . 2 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 1,500mAh బ్యాటరీతో మెమరీని విస్తరించేందుకు మైక్రో SD స్లాట్ కూడా ఉంది.  

రిలయన్స్ జియోఫోన్ కూడా క్వాల్కమ్ 205 మొబైల్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4 జీబి ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు మైక్రోఎస్డీ కార్డు ద్వారాస్టోరేజ్  విస్తరించవచ్చు. వెనుక 2 మెగాపిక్సెల్ కెమెరా మరియు ఇది 0.3 మెగాపిక్సెల్ ముందు కెమెరా కలిగి ఉంది, జియోఫోన్  బ్యాటరీ లైఫ్  48 గంటలు వరకు అందించే 2,000 mAh సామర్థ్యంతో పెద్ద బ్యాటరీని కలిగి ఉంది.

 నోకియా 8110 వెనుక నుండి కర్వ్డ్ గా  ఉంటుంది మరియు కీబోర్డును కలిగి ఉన్న ఒక స్లయిడర్ ని  కలిగి ఉంటుంది. 
మరోవైపు, జియోఫోన్, సంప్రదాయ ఫీచర్ ఫోన్ వలె కనిపిస్తుంది.  ఈ ఫోన్ పాత T9 కీబోర్డును కలిగి ఉంది, ఇది మరింత ఆకర్షణీయంగా ఉంది . ఫోన్ అయితే చాలా మన్నికైనది.

Connect On :