Nokia 8.1 గూగుల్ యొక్క కొత్త ARCore సపోర్టింగ్ డివైజ్ జాబితాలో కనిపించింది

Nokia 8.1 గూగుల్ యొక్క కొత్త ARCore సపోర్టింగ్ డివైజ్ జాబితాలో కనిపించింది
HIGHLIGHTS

కొన్నివారాల క్రితం చైనాలో విడుదలైన నోకియా X7 యొక్క గ్లోబల్ వేరియంట్, Nokia 8.1 గా అవతరించనుంది.

HMD గ్లోబల్ త్వరలో నోకియా 8.1  స్మార్ట్ ఫోన్నీ విడుదల చేయనున్నట్లు కనిపిస్తుంది. ఈ విషయాన్నీ మరెవరో కాదు స్వయానా Google చెబుతోంది, ఎందుకంటే    ARCore కు మద్దతు ఇచ్చే పరికరాల జాబితాను ఇది అప్డేట్ చేసింది,  ఈ కొత్త జాబితాలో ఇపుడు నోకియా 8.1 ను కలిగి ఉంది. అయితే, ఈ పరికరం గురించి ఏవిధమైన కొత్త సమాచారాన్ని మాత్రం వెల్లడించలేదు.

కొన్నివారాల క్రితం చైనాలో విడుదలైన నోకియా X7 యొక్క గ్లోబల్ వేరియంట్ కావచ్చు, అది బయటికి వచ్చిన గీక్బెంచ్ లిస్టింగ్ సూచిస్తుంది. మునుపటి నేమింగ్ కన్వెన్షన్స్ చేత, నోకియా X7 ను అంతర్జాతీయ మార్కెట్లలో నోకియా 7.1 ప్లస్ అని పిలుస్తారు. అయితే, నోకియా యొక్క చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ అయిన జుహు సర్వెకాస్ 2019 లో మరో పరికరానికి ఈ నోకియా 7.1 ప్లస్ పేరును రిజర్వు చేసింది.

ఈ నోకియా X7 ఒక 6.18 అంగుళాల ఫుల్ HD + ప్యూర్డిస్ప్లే HDR 10 మద్దతుతో మరియు 18.7: 9 యొక్క కారక నిష్పత్తితో  ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 710 SoC యొక్క శక్తిని కలిగి ఉంది మరియు 6GB RAM వరకు మరియు 128GB నిల్వ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర స్మార్ట్ఫోన్ల మాదిరిగా, 13MP + 12MP కలయికతో ఈ ఫోన్ డ్యూయల్ – వెనుక కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ముందు 20MP యూనిట్ మరియు ఈ ఫోన్ వేగవంతమైన ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే 3,500mAh బ్యాటరీని అందిస్తుంది.

ఒక ప్రత్యేక నివేదికలో, MySmartPrice.com రష్యాలో యురేషియా ఎకనామిక్ కమీషన్ (ECC) చే రెండు కొత్త నోకియా పరికరాలను ధృవీకరించిందని MySmartPrice.com తెలిపింది. ఈ రెండు పరికరాల మోడల్ సంఖ్య సంఖ్యలు TA-1087 మరియు TA-1119 లుగా ఉంటాయి. ఈ పరికరాల యొక్క ఖచ్చితమైన పేరు ఇంకా తెలియలేదు, అయితే ఇది నోకియా 8.1 మరియు నోకియా 7.1 ప్లస్ కావచ్చు అనుకుంటున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo