సూపర్బ్ నోకియా 8 వచ్చేస్తోంది. 23 మెగా పిక్సెల్ కెమెరా తో
HMD గ్లోబల్ గత ఏడాది ప్రకటించింది. 2017 లో, నోకియా (Nokia) బ్రాండ్ కింద అనేక Android స్మార్ట్ఫోన్లు ప్రవేశపెట్టబడతాయని మరియు వీటితో పాటుగా ఫీచర్ ఫోన్స్ కూడా ప్రవేశపెడుతుంది నోకియా అని . అయితే MWC 2017 లో , కంపెనీ ద్వారాగా నోకియా 3 (Nokia 3), నోకియా 5 (Nokia 5), నోకియా 3310 ( Nokia 3310) లను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ నోకియా 6 ( Nokia 6) ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ తొలిసారిగా చైనీస్ మార్కెట్ లో పరిచయం చేసింది. నోకియా వారి అన్ని స్మార్ట్ ఫోన్స్ అతి త్వరలో భారత్ లో విడుదలకు సిద్ధముగానున్నాయి .
అయితే గత కొంత కాలంగా నోకియా 8 గూర్చి అనేక వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వార్త ఏమిటంటే నోకియా 8 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 23 మెగా పిక్సెల్ రేర్ కెమెరా కలిగి ఉందని మరియు ఈ కెమెరా లో Carl Zeiss అమర్చారని సమాచారం.
కొత్తగా వచ్చిన రూమర్స్ ప్రకారం నోకియా 8 Android స్మార్ట్ఫోన్ 5.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే , QHD డిస్ప్లే మరియు 2560×1440 పిక్సెళ్ళు రెసొల్యూషన్ కలిగి ఉంటుంది ,. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అమర్చారు . దీనితో పాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835 ప్రాసెసర్ లేదా స్నాప్డ్రాగెన్ 821 ప్రాసెసర్ తో ఉన్నట్లు భావిస్తున్నారు. 6GB RAM తో పాటుగా 64GB మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉండవచ్చని భావిస్తున్నారు. మరియు 23 మెగాపిక్సల్ రేర్ కెమెరా మరియు 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా మరియు 3500mAh బ్యాటరీ మరియు వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ ప్రూఫ్ కలిగి ఉందని మరియు డ్యూయల్ సిం అని ఆండ్రాయిడ్ 7. 0 నాట్ ఆధారముగా పనిచేస్తుందని సమాచారం.