Nokia 8 కి ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ , ఈ నెలలోనే

Nokia 8 కి ఆండ్రాయిడ్ ఓరియో  అప్డేట్ , ఈ నెలలోనే
HIGHLIGHTS

నోకియా యొక్క ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ నోకియా 8 అతి త్వరలో ఒరియో అప్డేట్ ని పొందుతుంది.

నోకియా యొక్క  ఫ్లాగ్షిప్  స్మార్ట్ఫోన్ నోకియా 8 అతి త్వరలో ఒరియో అప్డేట్ ని పొందుతుంది. నోకియా నోకియా 6 కోసం అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్తో ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్ అప్డేట్ కూడా జారీ చేసింది .  NokiaPowerUser యొక్క రిపోర్ట్  ప్రకారం, నోకియా 8 ఒక Android 7.1.2 అప్డేట్ పొందదు ఎందుకంటే   కంపెనీ  ఈ స్మార్ట్ఫోన్ కి   ఆండ్రాయిడ్ ఒరియో ఇవ్వటానికి  సిద్ధం చేస్తుంది.

రిపోర్ట్స్  ప్రకారం, నోకియా 8 అక్టోబర్ చివర లేదా నవంబరు మొదట్లో ఆండ్రాయిడ్ ఒరియో అప్డేట్ ని  పొందుతుంది. ఈ డివైస్ ఆండ్రాయిడ్ 7.1.2 అప్గ్రేడ్ కాకుండా నేరుగా ఆండ్రాయిడ్ ఒరియో పొందనుంది .

నోకియా సెప్టెంబర్లో భారతదేశంలో నోకియా 8 ఫ్లాగ్షిప్  స్మార్ట్ఫోన్ ని  విడుదల చేసింది. దీని ధర రూ. 36,999 , మరియు స్నాప్డ్రాగెన్ 835 మొబైల్ ప్లాట్ఫారమ్ కలిగి  ఉంది. ఈ డివైస్ కి 5.3 అంగుళాల QHD స్క్రీన్ ఉంది, ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ లో 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్  అమర్చారు మరియు దాని స్టోరేజ్ ని  మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు పెంచవచ్చు.

నోకియా 8 వెనుక 13MP డ్యూయల్ కెమెరా సెటప్  మరియు 13MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  ఉంది. రెండు కెమెరాలు ZEISS ఆప్టిక్స్ తో వస్తాయి. ఈ స్మార్ట్ఫోన్  లో  3,090 ఎమ్ఏహెచ్ బ్యాటరీ క్విక్  ఛార్జ్ 3.0 కి సపోర్ట్ ఇస్తుంది. 

 

 

 

 

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo