నోకియా 7.1 ప్లస్ నోచ్ డిస్ప్లేతో విడుదలయ్యే అవకాశముంది, కానీ ఇటీవలే వచ్చిన కొత్త నివేదిక ప్రకారం, అది నోచ్ – లెస్ స్క్రీన్తో రావచ్చు అనికూడా తెలుస్తోంది. HMD గ్లోబల్ త్వరలో నోకియా 7.1 మరియు నోకియా 7.1 ప్లస్లను ప్రారంభించబోతుందని కొత్త నివేదిక తెలిపింది. నోకియా 7.1 ఒక రెగ్యులర్ డిస్ప్లే తో రావచ్చు,అయితే నోకియా 7.1 ప్లస్ నోచ్ స్క్రీన్లను కలిగి ఉంటుంది, నోకియా 6.1 ప్లస్ మరియు నోకియా 5.1 ప్లస్ లలో చూసినట్లుగా అని ఈ నివేదిక వెల్లడిస్తుంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో, HMD గ్లోబల్ నోకియా 7 ప్లస్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. నోకియా యొక్క మునుపటి నోకియా 7 ప్లస్ స్థానాన్ని ఈ నోకియా 7.1 భర్తీ చేస్తుందని ఊహాగానాలున్నాయి. నోకియా 7.1 ఒక 6-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటుంది, దీని యాస్పెక్ట్ రేషియో 18: 9 ఉంటుంది. ఇది కాకుండా, స్నాప్డ్రాగెన్ 710 చిప్సెట్లను, 4 జీబి ర్యామ్ మరియు 64 జీబి స్టోరేజిలను ఈ స్మార్ట్ఫోన్ కలిగి ఉండేందుకు అవకాశం ఉంది.
నోకియా 7.1 ప్లస్ కూడా Snapdragon 710 తో అమర్చబడుతుందని భావిస్తున్నారు, ఇది ఒక ప్లస్ వేరియంట్ అయితే ఇది మరింత RAM మరియు అంతర్గత స్టోరేజిలతో చేర్చబడుతుంది. ఈ స్మార్ట్ఫోన్ 6GB RAM మరియు 128GB అంతర్గత స్టోరేజి ద్వారా ఆధారితం అవుతుంది. ఈ హ్యాండ్ సెట్లో పెద్ద స్క్రీన్లు మరియు బ్యాటరీలు కలిగివుండే అవకాశం కూడా ఉంది మరియు ఈ రెండు డివైజ్లను Android One స్మార్ట్ఫోన్లుగా చెప్పవచ్చు.
ఫిన్లాండ్ యొక్క ఈ సంస్థ ఒక పోస్ట్ ద్వారా అక్టోబర్ 4 న ఒక పత్రికా కార్యక్రమం జరుగనున్నట్లు నిర్ధారించింది. అదే రోజు నోకియా 7.1 ప్లస్ స్మార్ట్ఫోన్ను సంస్థ అందించగలదని మునుపటి నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పుడు నోకియా 7.1 మరియు 7.1 ప్లస్ ధరల గురించి ఇంకా పూర్తి సమాచారం తెలియరాలేదు.