గత వారం, నోకియా 7 కోసం చైనాలో ప్రారంభించిన మొట్టమొదటి ఫ్లాష్ సేల్ లో నిన్నటి వరకు 1 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి, ఈ స్మార్ట్ఫోన్ కోసం మొట్టమొదటి సేల్ ప్రారంభమవుతుంది .
అయినప్పటికీ, 1 లక్షల రిజిస్ట్రేషన్లు సాధారణ స్థాయిలో ఉన్నాయి ఎందుకంటే అవి ప్రీ ఆర్డర్లు కాదు. ఇంతవరకు ప్రజలు దీని కోసం ఎటువంటి డబ్బు ఇవ్వలేదు. ఫైనల్ సేల్ లో దీని కంటే తక్కువ నంబర్స్ ని చూడొచ్చు .
స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే , నోకియా 7 5.2 అంగుళాల IPS LCD డిస్ప్లే కలిగి ఉంది, అది 1920 x 1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ తో మరియు పైన 2.5D కవరేజ్ గ్లాస్ ను కలిగి ఉంటుంది. ఈ డివైస్ Snapdragon 630 చిప్సెట్, 4GB లేదా 6GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అమర్చబడి ఉంటుంది మరియు దాని స్టోరేజ్ SD కార్డ్ ద్వారా 128GB వరకు పెంచబడుతుంది.
నోకియా 7 ఒక 16MP ప్రాధమిక కెమెరాని కలిగి ఉంటుంది, ఇది f / 1.8 ఎపర్చరు మరియు డ్యూయల్ టోన్ ఫ్లాష్ తో వస్తుంది. ఇది 5MP కెమెరాను కలిగి ఉంది, ఇది f / 2.0 ఎపర్చరు మరియు 84 డిగ్రీ వైడ్ ఫీల్డ్ తో వస్తుంది. మీరు బొథీ ఫీచర్ ద్వారా ఒకే సమయంలో ముందు మరియు వెనుక కెమెరా షూట్ చేయొచ్చు . మరియు ఇది Facebook లైవ్ మరియు YouTube తో ఇంటిగ్రేటెడ్. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్ వైఫై, బ్లూటూత్ 5.0, GPS, A-GPS మరియు గోల్డ్నాస్, NFC, 3.5mm ఆడియో జాక్ మరియు USB టైప్-సి పోర్ట్లకు సపోర్ట్ ఇస్తుంది.
4GB RAM వేరియంట్ ధర CNY 2,499 (దాదాపు $ 377 లేదా € 320), అయితే 6GB RAM వేరియంట్ CNY 2,699 ($ 407 లేదా € 345) గా ఉంటుంది.
ఫ్లిప్కార్ట్ లో నేడు హెడ్ఫోన్స్ మరియు బ్లూటూత్ స్పీకర్ల పై భారీ ఆఫర్స్