నోకియా 7 మరియు నోకియా 8 డిజైన్ లీక్
నోకియా 8 లో రెండు రేర్ కెమెరాస్ వున్నాయి
ప్రసుతం వచ్చిన సమాచారం ప్రకారం , నోకియా 7 మరియు నోకియా 8 ఫోన్స్ క్వాల్కమ్ ప్రాసెసర్ 660 కలిగి వున్నాయి. దీనిలో CarlZeiss లెన్స్ కూడా వున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్స్ యొక్క డిసైన్ గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ రెండు ఫోన్స్ యొక్క స్కెచెస్ మనముందుకు వచ్చాయి.
ఈ స్కెచెస్ చూస్తే తెలుస్తున్నదేమిటంటే , ఈ ఫోన్స్ లో ఒకదానిలో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి వుంది. ఆశాజనకంగా నోకియా 8 లో 2 రేర్ కెమెరాస్ ఉండవచ్చని సమాచారం.
ఇప్పటివరకు (Nokia 8) గురించి అనేక పుకార్లు వచ్చాయి. అయితే(Nokia 7) గురించి ఎటువంటి సమాచారం లేదు . కానీ నోకియా 7 చాలా లక్షణాలు నోకియా 8 వలె ఉంటాయని చెప్తున్నారు . రెండిటిస్నాప్ డ్రాగన్ 660 చిప్ కలిగి ఉంటుంది
గత కొంత కాలం నుంచి (Nokia 8) ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ గురించి చాలా పుకార్లు వచ్చాయి.ఇప్పుడు తాజాగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం (Nokia 8) ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 23 మెగా పిక్సెల్ రేర్ కెమెరా తో వస్తుంది. ఈ రేర్ కెమెరా Carl Zeiss లెన్స్ తో వస్తుంది.ఇప్పటివరకు వచ్చిన పుకార్ల ప్రకారం (Nokia 8) ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో 5.7ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మరియు రెసొల్యూషన్ 2560×1440 పిక్సల్స్ ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. దీనితో పాటుగా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ లేదా స్నాప్ డ్రాగన్ 821 ప్రాసెసర్ ఉండవచ్చని అంచనా
దీనితో పాటుగా 6GB ర్యామ్ మరియు 64GB మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉండవచ్చని భావిస్తున్నారు . స్టోరేజ్ ను 256GB వరకు ఎక్సపాండ్ చేయవచ్చు . దీనిలో 24 మెగా పిక్సెల్ రేర్ కెమెరా మరియు 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 3500mAh బ్యాటరీ . బ్యాటరీ వాటర్ మరియు డస్ట్ ప్రూఫ్ ఉంటుందని అంటున్నారు . డ్యూయల్ సిం ఫోన్ మరియు మరియు ఆండ్రాయిడ్ 7.0 nougat ఫై పనిచేస్తుంది.