నోకియా 7 బోథీ కెమెరా మరియు స్నాప్డ్రాగన్ 630 చిప్సెట్ తో చైనాలో ప్రారంభించబడింది.
HMD గ్లోబల్ దాని 2017 లైన్ అప్ లో మరో కొత్త స్మార్ట్ఫోన్ ని చేర్చింది. ఫిన్లాండ్ కంపెనీ మరో మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ నోకియా 7 ను ప్రారంభించింది, ఇది చైనీస్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు న్యూ బోతి కెమెరా కలిగి ఉంది.
నోకియా 7 ను 7000 సిరీస్ అల్యూమినియం చట్రం మరియు గ్లాస్ బ్యాక్ తో తయారు చేసారు . ఈ స్మార్ట్ఫోన్ లో కార్నింగ్ యొక్క గోర్నిలా గ్లాస్ ఉంది, ఇది గ్లోస్ బ్లాక్ మరియు మెట్ వైట్ కలర్స్లో అందుబాటులో ఉంటుంది.
స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే , నోకియా 7 5.2 అంగుళాల IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది, అది 1920 x 1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ మరియు పైన 2.5D కవరేజ్ గ్లాస్ ను కలిగి ఉంటుంది. ఈ డివైస్ స్నాప్ డ్రాగన్ 630 చిప్సెట్, 4GB లేదా 6GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అమర్చబడి ఉంటుంది మరియు దాని స్టోరేజ్ SD కార్డ్ ద్వారా 128GB వరకు పెంచబడుతుంది.
నోకియా 7 ఒక 16MP ప్రాధమిక కెమెరాని కలిగి ఉంటుంది, ఇది f / 1.8 ఎపర్చరు మరియు డ్యూయల్ టోన్ ఫ్లాష్ తో వస్తుంది. ఇది 5MP కెమెరాను కలిగి ఉంది, ఇది f / 2.0 ఎపర్చరు మరియు 84 డిగ్రీ వైడ్ ఫీల్డ్ తో వస్తుంది. బోతీ ఫీచర్లు ద్వారా ఒకే సమయంలో ముందు మరియు వెనుక కెమెరాతో షూట్ చేయవచ్చు . మరియు ఇది Facebook లైవ్ మరియు YouTube లైవ్ లతో ఇంటిగ్రేడెడ్ . కనెక్టివిటీ కోసం ఈ ఫోన్ వైఫై, బ్లూటూత్ 5.0, GPS, A-GPS మరియు , NFC, 3.5mm ఆడియో జాక్ మరియు USB టైప్-సి పోర్ట్ కు సపోర్ట్ చేస్తుంది.
నోకియా 7 వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్లను కలిగి ఉంది మరియు ఆండ్రాయిడ్ నౌగాట్ పై రన్ అవుతోందని భావిస్తున్నారు . భవిష్యత్తులో ఒరియో అప్డేట్ తో వస్తుందట . ఈ స్మార్ట్ఫోన్ 3000mAh బ్యాటరీ కలిగి ఉంది. నోకియా 7 4GB RAM వేరియంట్ 2,499 యువాన్ (సుమారు రూ .25,000) ధరకే మరియు 6GB RAM వేరియంట్ 2,699 యువాన్ (సుమారు రూ .27,000) ధరకే లభ్య మవ్వబోతున్నాయి . ఈ స్మార్ట్ఫోన్ ని ప్రీ ఆర్డర్ చేయడానికి, Suning మరియు T-మాల్ మరియు JD.com లో అందుబాటులో ఉంది మరియు అక్టోబర్ 24 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.