గత వారంలో న్యూ ఢిల్లీ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసారు. ఇప్పుడు నోచ్ డిస్ప్లే తో కూడిన ఈ నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు నోకియా ఆన్లైన్ స్టోర్ల ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదటి సారిగా అమ్మకానికి సిద్దమవుతుంది. ఈ నోకియా 6.1 కేవలం నోచ్ డిస్ప్లే నే కాకుండా స్నాప్ డ్రాగన్ 636 SoC మరియు డ్యూయల్ కెమెరా సెటప్ తో మరింత బలంగా షియోమీ నోట్ 5 ప్రో కి ధీటుగా మార్కెట్లో నిలవనుంది అని మార్కెట్ వర్గాల అంచనా.
Nokia 6.1 Plus ధర మరియు లాంచ్ ఆఫర్లు
ఈ నోకియా 6.1 ప్లస్ ఇండియాలో రూ . 15,999 ధరతో వస్తుంది , అయితే కేవలం 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి యొక్క ఒక్క వేరియెంట్ తో మాత్రమే వస్తుంది. ఇప్పటి వరకు Flipkart మరియు నోకియా ఆన్లైన్ స్టోర్ లలో ఇది ప్రీ – ఆర్డర్ కి మాత్రమే అందుబాటులో వుంది కానీ ఇప్పుడు ఇది డైరెక్ట్ ఆన్లైన్ సేల్స్ కి కూడా అందుబాటులో ఉంటుంది. ఇండియాలో ఆగష్టు 31 నుండి ఈ ఫోన్ల షిప్పింగ్ ని కూడా మొదలుపెట్ట నుందని నోకియా అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియ వచ్చింది.
లాంచ్ ఆఫర్స్ ప్రకారంగా చుస్తే , జియో వినియోగదారులకు 240జీబీ (ప్రతి నెలా 20జీబీ 12 నెలలవరకు రూ . 199, రూ . 249 లేదా రూ . 448 రీచార్జి ప్లాన్ తో పాటు) ల కాంప్లిమెంటరీ డేటా మరియు నెలకు రూ . 50 రూపాయల గల 36 వోచర్ల మొత్తం రూ . 1,800 ల కాష్ బ్యాక్ ని పొందే అవకాశముంది. కొనుగోలుధారులకి అదనంగా ఇక్కడ 'నో కాస్ట్ EMI' కూడా అందుబాటులో ఉంది. అలాగే Flipkart వినియోగదారులు దీనిని Axis బ్యాంకు బజ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడంవలన 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది మరియు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనడం వలన కూడా ఇదె వర్తింపు అనగా 5% తగ్గింపు లభిస్తుంది.
Nokia 6.1 Plus స్పెసిఫికేషన్స్
నోకియా 6.1 ప్లస్ డ్యూయల్ – సిమ్ స్మార్ట్ ఫోన్, బాక్స్ నుండి బయటకు వస్తూనే ఆండ్రాయిడ్ ఒరెయో తో పనిచేస్తుంది. ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ కావడం వలన మనకి టైం ప్రకారం అప్డేట్స్ అందుతాయి. ఈ డివైజ్ 19: 9 యాస్పెక్ట్ రేషియో తో కూడిన 1080 x 2280 పిక్సల్స్ రిజల్యూషన్ గా కలిగిన 5.8 అంగుళాల పూర్తి హెచ్ డి + డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో అందించబడింది.
నోకియా 6.1 ప్లస్ స్నాప్ డ్రాగన్ 636 SoC, 4జీబీ LPDDR 4X ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి తో అనుసంధానమవుతుంది. స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 16ఎంపీ + 5ఎంపీ తో డ్యూయల్ – కెమెరా సెటప్ ఉంటుంది, ఇంకా ముందు భాగంలో సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా ఉంటుంది. 64జీబీ అంతర్గత మెమొరీలతో పాటుగా (దాదాపు 400జీబీ వరకు) స్టోరేజీ విస్తరించగల స్మార్ట్ ఫోన్. ఒక 3060mAh బ్యాటరీ మొత్తం ప్యాకేజీకి అవసరమైన శక్తినందిస్తుంది.