నేడు నోకియా 6.1 ప్లస్ భారతదేశంలో విడుదలవనుందని అంచనా: లైవ్ స్ట్రీమ్, అంచనా ధర, స్పెక్స్ మరియు మీకు కావాల్సిన సమాచారమంతా…

Updated on 21-Aug-2018
HIGHLIGHTS

HMD గ్లోబల్ ఒక కొత్త డివైజ్ ని విడుదల చేయనుంది ఈ రోజు న్యూ ఢిల్లీలో జరగనున్న ఒక కార్యక్రమంలో. ఇది HMD గ్లోబల్ వేరియంట్ అయిన నోకియా X6 తరువాతి క్రమమైన నోకియా 6.1 ప్లస్ కావచ్చని అంచనా.

 HMD గ్లోబల్ ఈ రోజు ఒక కొత్త డివైజ్ విడుదల చేయడానికి అన్ని సిద్ధంచేసింది, ఇది నోకియా 6.1 అని అందరూ అంచనా వేస్తున్నారు. కంపెనీ ముందు నుంచే టీజింగ్ ద్వారా దీని విడుదల గురించి తెలియ పరుస్తూ వచ్చింది మరియు ఇది ఇంతకూ ముందే వచ్చిన గ్లోబల్ వేరియంట్ అయిన  చైనా ఎక్స్క్లూజివ్ నోకియా X6 అని అందరూ అంచనా వేస్తున్నారు, కానీ ఇది ఖచ్చితంగా తెలియ రాలేదు. ఈ రానున్న డివైజ్ ఫ్లిప్ కార్ట్ ఎక్స్క్లూజివ్ గా ఆన్లైన్ లో అందవచ్చు , ఎందుకంటె ముందునుంచే ఈ రెండు బ్రాండ్స్ మద్య వున్న ఎక్స్క్లూజివ్ పార్టనర్షిప్ కారణంగా మనం అంచనా వేయవచ్చు. ఇదే కనుక నిజమైతే కొనుగోలుదారులు కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ తో ఈ ఫోన్ని ఆన్లైన్లో కొనుక్కునే అవకాశం ఉంటుంది. నోకియా 6.1 స్పెసిఫికేషన్స్ మరియు ధర పరంగా చుస్తే ఇది మిడ్ -రేంజ్ ఫోన్లు అయినటువంటి షియోమీ మీ ఏ 2, హువావే నోవా 3 మరియు హానర్ ప్లే కి ధీటుగా ఉండవచ్చు. 

నోకియా 6.1 విడుదల : లైవ్ స్ట్రీమ్ చూడడం ఎలా

ఆగష్టు 21న న్యూ ఢిల్లీలో మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న, ఈ విడుదల కార్యక్రమానికి నోకియా ఆతిధ్యం వహిస్తోంది. యుట్యూబ్ మరియు పేస్ బుక్ లాంటి సోషల్ మీడియాల ద్వారా ఈ కారక్రమం యొక్క  లైవ్ స్ట్రీమ్ ని కంపెనీ అందిస్తుంది.మీకోసం క్రింద ఎంబిడెడ్ వీడియో ని కూడా అందించాము ఇక్కడ కూడా మీరు లైవ్ స్ట్రీమ్ చూడవచ్చు. 

నోకియా 6.1 ప్లస్ అంచ ధర 

నోకియా 6.1 ప్లస్ యొక్క 4జీబీ ర్యామ్  + 64 జీబీ  స్టోరేజీ వేరియంట్ ఇటీవలే హాంగ్ కాంగ్లో HKD 2,288 (Rs. 20,000 సుమారు) వద్ద ప్రారంభించబడింది. అయితే, చైనాలో మాత్రం  నోకియా X6 ని మూడు వేరియంట్లు,  32జీబీ  మరియు 64జీబీ  అంతర్గత స్టోరేజి  ఎంపికలతో రెండు 4జీబీ  ర్యామ్ మోడల్లలో లభిస్తుంది, ఇవి CNY 1,299 (సుమారు రూ. 13,700) మరియు CNY 1,499 (సుమారు రూ .16,000) ధరతో వున్నాయి మరియు 6జీబీ ర్యామ్ + 64జీబీ  స్టోరేజ్ మోడల్ కూడా ఉంది, ఇది CNY 1,699 ధరకే (సుమారు రూ .18,200)అందుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ని భారతదేశంలో అదే ధరతో  అందిస్తారని  భావిస్తున్నారు.  

నోకియా 6.1 ప్లస్ స్పెసిఫికేషన్స్ 

నోకియా 6.1 ప్లస్ నోకియా X6 వలె అదే ఫీచర్స్ తో ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 SoC చేత శక్తినివ్వబడినది మరియు  19: 9 యాస్పెక్ట్ రేషియో గల ఒక 5.8 అంగుళాల ఫుల్ హెచ్ డి+ నోచ్  డిస్ప్లే కలిగి ఉంది, ఇది గొరిల్లా గ్లాస్ 3 ద్వారా రక్షించబడింది. ఈ డివైజ్ గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ వన్ చొరవలో భాగంగా ఉంటుంది మరియు ఆండ్రాయిడ్ 8.1 Oreo తో ప్రారంభించాలని భావిస్తున్నారు. క్విక్  ఛార్జ్ 3.0 కి మద్దతిచ్చే 3060 mAh బ్యాటరీ మరియు డ్యూయల్ – సిమ్ కి డివైజ్ సమర్థిస్తుంది.

ఆప్టిక్స్ ప్రకారం, నోకియా 6.1 ప్లస్, డ్యూయల్-కెమెరా సిస్టమ్ తో 16ఎంపీ  + 5ఎంపీ  సెన్సార్స్ మరియు జైస్ లెన్సులు వెనుకవైపు అమర్చబడింది. ముందు ఒక 16 ఎంపీ  సెన్సార్ మరియు రెండు కెమెరాలు ఒక f / 2.0 ఎపర్చరు కలిగివున్నాయి.
       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :